• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కస్టడీ’ మేకింగ్ వీడియో: కృతిశెట్టి కష్టం చూశారా?

    యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలోని ఓ హైలెట్ సీన్ మేకింగ్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా షూట్ చేశారనేది చూపించారు. ఈ సీన్ కోసం చైతూ, కృతిశెట్టి ఎంత కష్టపడ్డారో వీడియోలో చూడవచ్చు. కాగా ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. The highly … Read more

    ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ చేశా: కృతిశెట్టి

    నాగచైతన్య అక్కినేని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో కృతిశెట్టి మీడియాతో మాట్లాడింది. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నా క్యారెక్టర్ నిడివి కూడా ఎక్కువే. ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశా. రెండువారాలపాటు అండర్ వాటర్ సీక్వెన్స్ చేశాం. ఐదు రోజులపాటు కంటిన్యూగా నీటిలోనే ఉన్నా.’’ అంటూ అమ్మడు చెప్పుకొచ్చింది.

    సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

    సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

    ఆసక్తిగా ‘కస్టడీ’ ట్రైలర్

    యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో చైతూ పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మూవీని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ సినిమాలో అరవిందస్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    నాగ చైతన్య కస్టడీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌

    విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిన కస్టడీ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్ విడుదలయ్యింది. హెడ్‌ అప్‌ హై అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుది. కానిస్టేబుల్ పాత్రలో చైతు నటిస్తుండగా… కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే 12న సినిమాను విడుదల చేయనున్నారు.

    కస్టడీ టీజర్‌, బీజీఎం అదిరిపోయాయి!

    యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

    NEW YEAR: కస్టడీ గ్లింప్స్ విడుదల

    నాగచైతన్య 22వ సినిమా ‘కస్టడీ’ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా చైతూ ఇందులో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు తెలుగులో తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. పైగా మ్యూజిక్ సెన్సేషన్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో మే 12న కస్టడీ విడుదల కానుంది.