• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ కాల్పులు నేను జరపలేదు: మనోజ్

    హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో జరిగిన కాల్పులతో తనకు సంబంధం లేదని ‘కార్తీకదీపం’ ఫేమ్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నా. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కాల్పుల విషయం చెప్పారు. తొలుత ప్రాంక్ చేస్తున్నారనుకున్నా. కానీ నా పేరుతో ఉన్న మరో వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు తెలిసింది. నేను కాల్పులు జరిపాననడం ఫేక్ న్యూస్. టీవీ9, ఎన్టీవీలలో నా ఫొటో ప్రదర్శించి పరువునష్టం కలిగించినందుకు ఆ ఛానెళ్లపై కేసు వేస్తా.’’ అంటూ పేర్కొన్నారు. https://www.instagram.com/reel/CutillIgbY4/?utm_source=ig_web_copy_link

    దొంగపై కస్టమర్ బుల్లెట్ల వర్షం; వీడియో వైరల్

    ఇటీవల అమెరికాలో ఓ కస్టమర్.. దోపిడీ దొంగను కాల్చి చంపిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి దుండగుడు చొరబడ్డాడు. బొమ్మ తుపాకీ చూపించి రెస్టారెంట్ ఓనర్‌ను, సిబ్బందిని, కస్టమర్లను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ఈ క్రమంలో కస్టమర్లలోని ఓ వ్యక్తి ఆ దొంగపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ దొంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పోలీసులు ఆ కస్టమర్‌ను అరెస్ట్ చేయలేదు. ?#WATCH: Self-defense shooting of armed robber … Read more

    మెట్రో స్టేషన్ లో కాల్పులు

    ఇరాన్ లోని టెహ్రాన్ లో కాల్పుల కలకలం రేగింది. మెట్రో స్టేషన్ లో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసేందుకు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. భద్రతా దళాలు కాల్పులు ఎందుకు జరిపారో తెలియాల్సి ఉంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on … Read more