• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డెవిల్’ విడుదల వాయిదా పడినట్లేనా?

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘డెవిల్’ చిత్రంపై లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 24, వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే పలు సాంకేతిక కారణాల వలన, సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు.

    రేపు డెవిల్‌ నుంచి ఫస్ట్ సింగిల్

    నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం డెవిల్. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతోంది. బ్రిటిష్ సిక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. https://x.com/shreyasgroup/status/1703696072122765701?s=20

    కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్

    నందమూరి కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్ జంటగా “డెవిల్” చిత్రం తెరకెక్కుతుంది.ఈ మూవీని దర్శకుడు నవీన్ మేడారం రూపొందిస్తున్నారు.. ఈ సినిమా నుంచి తాజా రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా అకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నాటి ఓ గూఢచారి కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. Anna Two Roles #Devil Movie Theatres Tagalabadipothai ??.@NANDAMURIKALYAN @iamsamyuktha_ pic.twitter.com/NrlmkFBDXZ — VishnuVarthanReddy (@RVVR9999) July 5, 2023

    LIVE: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన అమిగోస్ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. డోపుల్ గ్యాంగర్‌ అనే కథాంశంతో సినిమాను రూపొందించారు. ముగ్గురు ఒకేలా ఉంటారు కానీ, కవలలు కాదు.

    కల్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్

    కల్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేస్తుండగా… ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అభిమానులు అంచనాలు తగ్గట్లుగానే రూపొందించారు. డోపుల్ గ్యాంగర్ నేపథ్యంలో సాగే కథతో మరోసారి హిట్‌ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. డోపుల్ గ్యాంగర్ అంటే ఒకే పోలికతో ఉండే వ్యక్తులు.. కానీ, కవలలు కాదు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించింది.

    విషమించిన తారకరత్న హెల్త్… ఆస్పత్రికి జూ.ఎన్టీఆర్

    [VIDEO](url): తారకరత్న ఆరోగ్యం మరింత విషమించింది. కాసేపట్లో ఆయన ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర నందమూరి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అభిమానులు సైతం భారీగా చేరుకున్నారు. తారకరత్నకు ECMO ద్వారా చికిత్స అందిస్తున్నట్లు హృదయాలయ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు వెల్లడించారు NTR @tarak9999 & @NANDAMURIKALYAN at Narayana Hrudayala, Blr to visit #TarakaRatna pic.twitter.com/c0NkrPcEsV — Nandamurifans.com (@Nandamurifans) January 29, 2023

    ‘అమిగోస్‌’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

    నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్‌’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘యెకా.. యెకా’ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

    ఆమిగోస్‌గా భయపెడుతున్న కళ్యాణ్ రామ్

    మరో వినూత్నమైన కథాంశంతో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఆమిగోస్ నుంచి టీజర్ రిలీజైంది. ఎలాంటి బయోలాజికల్ కనెక్షన్ లేకుండా ఒకే రూపంలో ఉండే ముగ్గురి పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించారు. ఇలా ముగ్గురు వ్యక్తులు కలవడం వెనుక ఓ సిక్రెట్ ఆపరేషన్ ఉందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఆశిఖ రంగానాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమిగోస్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

    స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ ‘బింబిసార’ టీమ్‌

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ భారీ విజ‌యం సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా మంచి వ‌సూళ్ల‌ను కురిపిస్తుంది. ఇప్ప‌టికే బ్రేక్‌-ఈవెన్ సాధించి లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమా నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సంతోషాన్ని మిగిల్చింది. దీంతో చిత్ర‌బృందం తాజాగా కేక్ క‌ట్‌చేసి గ్రాండ్‌గా స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. బింబిసార‌కు వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కేథ‌రిన్‌, సంయుక్త మీన‌న్ హీర‌రోయిన్లుగా న‌టించారు. కీర‌వాణి మ్యూజిక్ అందించాడు.

    ‘బింబిసార’ ర్యాప్ సాంగ్ రిలీజ్

    నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ‘బింబిసార’ మూవీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే అత్యంత వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవ‌లం అమెరికాలోనే ఇప్ప‌టివ‌ర‌కు 350కె డాల‌ర్లు సాధించింది. తాజాగా మూవీ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎం.ఎం కీర‌వాణి మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను లిప్సిక‌, పృథ్వీ చంద్ర‌, ఆదిత్య అయ్యంగార్ క‌లిసి పాడారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌ను క‌లిపి చేసిన ఈ ర్యాప్‌సాంగ్ అద‌ర‌గొడుతుంది. మీరూ ఓ లుక్కేయండి.