• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూల్స్ రంజన్ ట్విట్టర్‌ రివ్యూ

  కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో వచ్చిన రూల్స్ రంజన్ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంది. లుక్స్, యాక్టింగ్ ఓకే. నేహశెట్టితో రొమాన్స్ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ కామెడీ లైనప్‌తో బాగుండి. సెకండాఫ్ పర్వాలేదు. సినిమాలో పాటలు బాగున్నాయి. సమ్మోహనుడా సాంగ్ థియేటర్లలో కేకలు పుట్టించింది అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

  రూల్స్ రంజన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్

  కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. నాలో నేనే లేను అంటూ సాగే మెలోడి ఆకట్టుకుంటుంది. చిత్రానికి రత్నం క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరి. అమ్రిశ్ సంగీతం అందించాడు. కిరణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో హిట్ అందుకున్నా..తర్వాత వచ్చిన మీటర్ బోల్తా కొట్టింది.

  నన్ను తొక్కేయాలని చూస్తున్నారు : కిరణ్ అబ్బవరం

  టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డారు. “ ట్విటర్‌లో కొన్ని బ్యాచ్‌లు తయారవుతున్నాయి. నన్ను తొక్కేయాలని చూస్తున్నారు. సినిమా బాగున్నా ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ ఏం లేదు. ఇక్కడ పెద్ద పెద్దోళ్లు అంతా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీరే ఇలా చేస్తున్నారు. నన్ను మీరు ఇంటికి పంపించేద్దాం అనుకున్నా నేను వెళ్లను” అన్నారు.

  వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్

  యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా లవ్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే అంటూ సాగే పాట అలరిస్తోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడుతున్నట్లు ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సినిమాలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=EjzfkqfmUo

  వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట విడుదల

  టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. దర్శనా అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కిరణ్ సరసన కశ్మీరా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా అలరిస్తుండటంతో సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకంతో ఉంది.

  వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌

  యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ నుంచి టీజర్‌ విడుదలయ్యింది. లవ్‌, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయంటూ చెప్పి, అసలు కాన్సెప్ట్‌ చెప్పకుండా టీజర్‌ను సిద్ధం చేశారు. టీజర్ కట్ చాలా కొత్తగా ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌ మరింత మెరుగుపడింది. సినిమాలో కశ్మీరా హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, అమల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.

  ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ రిలీజ్

  టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా తిరుమల తిరుపతి నేపథ్యంలో.. లవ్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో తెరకెక్కుతోంది. కిరణ్ సరసన కశ్మీర పర్దేశీ నటిస్తోంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

  ‘తెలియకుండానే పవన్ అభిమానిగా మారాను’

  తనకు తెలియకుండానే హీరో పవన్‌ కల్యాణ్‌ మూవీలకు కనెక్ట్ అయ్యానని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు. ఖుషి సినిమా చూసిన తర్వాత పవన్‌పై మరింత అభిమానం పెరిగిందని తెలిపాడు. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ గారే తనకు గొప్ప అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పవన్ సినిమాల్లో ఓ డైలాగ్ చెప్పాలని యాంకర్ కోరగా.. ఏది పడితే అది చెప్పలేనని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ స్మైల్, డైలాగ్స్ డెలివరీ బాగుంటుందన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రీ రిలీజ్ … Read more

  కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ సాంగ్ రిలీజ్

  కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కాల్సిన‌వాడిని’ మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అట్టాంటి ఇట్టాంటి అనే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. మణిశ‌ర్మ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ, సాకేత్ క‌లిసి పాడు. ఈ సినిమాలో సంజ‌న ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కోడి దివ్య నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.

  కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘న‌చ్చావ్ అబ్బాయ్’ సాంగ్ రిలీజ్

  కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయింది. న‌చ్చావ్ అబ్బాయ్ అనే ఈ పాట ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. మ‌ణిశ‌ర్మ దీనికి మ్యూజిక్ అందించ‌గా..ధ‌నుంజ‌య్, లిప్సిక క‌లిసి పాడారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న సంజ‌నా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.