యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ నుంచి టీజర్ విడుదలయ్యింది. లవ్, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయంటూ చెప్పి, అసలు కాన్సెప్ట్ చెప్పకుండా టీజర్‌ను సిద్ధం చేశారు. టీజర్ కట్ చాలా కొత్తగా ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ మరింత మెరుగుపడింది. సినిమాలో కశ్మీరా హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, అమల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.