కళాతపస్వితో నటించడం అదృష్టం; ఏపీ మంత్రి రోజా
కళాతపస్వి, దగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్‌తో నటించడం తన అదృష్టమని సినీ నటి, ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. విశ్వనాథ్ మృతి పట్లు ఆమె సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. 1995లో వచ్చిన ‘వజ్రం’ సినిమాలో తనతో కలసి నటుడిగా నటించారని గుర్తు చేసుకున్నారు. కాగా కే విశ్వనాథ్ వద్ధాప్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.