ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై రోజాపై ధ్వజమెత్తారు. ‘‘రోజా.. నీది నోరా.. [కుప్పతొట్టా](url)’’ అని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోమని హితవు పలికారు. రోజా మంత్రి పదవి నుంచి దిగిపోయేసరికి పర్యాటక రంగం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది.