• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లిపీటలు ఎక్కనున్న వరుణ్ తేజ్; ఆమెతోనేనా?

  త్వరలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ప్రకటన వస్తుందని ఆయన తండ్రి, నటుడు నాగబాబు ప్రకటించారు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని వెల్లడించలేనని.. పెళ్లికూతురుకు సంబంధించిన విషయాలను తాను చెప్పదలుచుకోలేదని పేర్కొన్నారు. వివాహం అనంతరం వరుణ్ తన భార్యతో కలసి వేరే ఇంట్లో ఉంటాడని.. తాను తన భార్యతో కలసి మరో ఇంట్లో ఉంటానని నాగబాబు వివరించారు. కాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

  వారాహి యాత్ర జరిపి తీరుతాం; నాగబాబు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటే పాదయాత్ర చేస్తామని జనసేన పీఏసీ మెంబర్ కొణిదెల నాగబాబు అన్నారు. వారాహి యాత్రకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదని పేర్కొన్నారు. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై పార్టీ నాయకులు, వీర మహిళలతో చర్చించారు.

  జనసేన పొత్తులపై నాగబాబు స్పందన

  జనసేన పొత్తులపై ఆ పార్టీ నేత నాగబాబు స్పందించారు. ‘పొత్తుల విషయం జనసేన అధినేత పవన్ ప్రకటిస్తారు. సమయం వచ్చినప్పుడు పవన్ అన్ని విషయాలు చెబుతారు. సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ వైసీపీగా మారిపోయింది కదా. రోజా గురించి మాట్లాడటం అంటే, మా స్థాయిని తగ్గించుకోవడమే. మేం బీజేపీతో కలిసే ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.

  పవన్‌ని సీఎం చేయడమే మా లక్ష్యం: నాగబాబు

  పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యం అంటూ ఆయన సోదరుడు నాగబాబు వెల్లడించారు. కర్నూలులో జరిగిన వీర మహిళల సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసలు పార్టీయే కాదని మండిపడ్డారు. పొత్తులపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారంటూ స్పష్టం చేశారు. వైసీపీలా తాము దిగజారి మాట్లాడబోమని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్‌‌పై పోటీ చేస్తానన్న ఆలీ కామెంట్స్‌పై స్పందించడం అనవసరమని వ్యాఖ్యానించారు. ఆలీ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

  రాంగోపాల్‌ వర్మపై నాగబాబు ఫైర్‌

  పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ కులాలను ఉద్దేశించి రామ్‌ గోపాల్‌ వర్మ చేస్తున్న వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు.” రాంగోపాల్‌ వర్మ పెద్ద వెధవ. అలాంటి సన్నాసి. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను. కానీ, కుల పిచ్చి లేదు. అందర్ని ఒకేలా చూస్తాను. ఒక కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తప్పు. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది. ప్రజలు ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా? అన్నారు.

  రోజా.. అది నోరా.. కుప్పతొట్టా? సినీనటుడు నాగబాబు

  ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాపై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై రోజాపై ధ్వజమెత్తారు. ‘‘రోజా.. నీది నోరా.. [కుప్పతొట్టా](url)’’ అని ఎద్దేవా చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోమని హితవు పలికారు. రోజా మంత్రి పదవి నుంచి దిగిపోయేసరికి పర్యాటక రంగం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. #KuppaThottiRoja https://t.co/Y1ri1JB8QW — satyam (@SatyamAmp) … Read more

  చిరంజీవిని ఎవరు లెపాల్సిన పనిలేదు: తమ్మిరెడ్డి

  మెగాస్టార్ చిరంజీవిని ఎవరో జాకీలు పెట్టి లెపాల్సిన పనిలేదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఆయన రెమ్యూన్, ప్రతిష్ట ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి అగ్రహీరో తన కేరీర్‌లో లీన్ పిరియడ్ చూశారని చెప్పారు. బాలకృష్ణ నాలుగేళ్ల క్రితం ఇదే స్థితిని ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. తర్వాత సింహాతో కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చిరంజీవిని మరోకరితో నాగబాబు పొల్చాల్సిన పనిలేదన్నారు.

  ‘పవన్ తలచుకుంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు’

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలచుకుంటే ఎప్పుడో కేంద్ర మంత్రి అయ్యేవాడని ఆయన సోదరుడు నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌పై గణ అనే వ్యక్తి రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడారు. పవన్ లాగా ఒక్క రోజైనా ఉండగలనా అని తనకు తానే ప్రశ్న వేసుకుంటానని చెప్పాడు. చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన సినిమా అవకాశాలు ఎవ్వరూ ఇవ్వరని, కష్టపడాల్సిందేనని పేర్కొన్నారు. విలువలతో బతికే వ్యక్తి పవన్ అని కొనియాడారు.

  సామ్‌ త్వరగా కోలుకోవాలి: నాగబాబు

  మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్‌ సమంతకు సినీ వర్గ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంకిస్తున్నారు. సమంతతో ఎప్పుడూ నేరుగా మాట్లడలేదు కానీ, ఆమెకు వ్యాధి రావటం బాధ కలిగించిందని నటుడు, నిర్మాత నాగబాబు పేర్కొన్నారు. ‘సమంత స్వతంత్ర మహిళ. చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న ఆశావాద వ్యక్తి. మయోసైటిస్‌ వ్యాధి నుంచి సామ్‌ త్వరగా కోలుకోవాలని మరోసారి కోరుకుంటున్నాను అని నాగబాబు పోస్ట్‌ చేశారు.

  ‘పవన్‌కు ఏదైనా జరిగితే ఊరుకోం’

  పవన్ కల్యాణ్‌ను ఏమైనా చేయాలంటే ముందు తనను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు. నేరపూరిత రాజకీయాలకు బలవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాట తనను చాలా బాధించిందని చెప్పారు. తమ నాయకుడే బలి కావాల్సి వస్తే.. మొదట బలయ్యేది తానేనని పేర్కొన్నారు. వైెస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.