బైక్ రైడర్స్‌కు రూ.77 వేల ఫైన్
ఖరీదైన కార్లు, బైక్‌లపై స్టంట్స్ చేస్తున్న యువకులకు యూపీ పోలీసులు షాకిచ్చారు. వారికి రూ.77 వేల జరిమానా విధించారు. హాపూర్‌లో కొంతమంది యువకులు రీల్స్ కోసం బెంజ్ కార్లు, స్పోర్ట్స్ బైక్‌లపై వెళ్తూ రీల్స్ చేశారు. ఇందుకోసం వాహనదారులను తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని గుర్తించి చలానా విధించారు. ఆ యువకులకు రూ.77 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారమే వారికి అంత భారీ మొత్తంలో ఫైన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.