జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కొన్నేళ్లు జబర్దస్త్ షోలో అలరించిన చంటి ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 6లో కనిపించారు ఆ షో తర్వాత చంటి పెద్దగా షోలు చేయడం….లేదు.
చంటికి ఈ నెల 21న తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలగా… స్టంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే.. ఇంకా ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంటి కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడా స్పందించడం లేదు.
జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చంటి. తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడు. ఎన్నో స్కిట్లు వేసి అలరించాడు. సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించాడు. భీమిలీ కబడ్డి జట్టు చిత్రంలో నాని స్నేహితుల్లో ఒకడిగా నటించాడు చంటి. అందులో ధన్‌రాజ్‌తో కలిసి నవ్వులు పూయించాడు. చాలా సినిమాల్లో చేసినప్పటికీ ఎక్కువగా పేరు వచ్చే పాత్ర ఏదీ దక్కలేదు.
గతకొంతకాలంగా చంటికి సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా అటు సినిమాల్లోనూ, ఏ షోలోనూ కనిపించలేదు. అవకాశాల దృష్ట్యా తన వాయిస్ ప్లస్, మైనస్ అంటాడు చంటి. దానివల్లే సినిమాల్లో కొన్ని అవకాశాలు పోయాయని.. కానీ, జబర్ధస్త్‌లో మాత్రం మంచి పేరు వచ్చినట్లు తెలిపాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!