• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియాపై పాక్ కోచ్ అక్కసు

    పాకిస్థాన్ కోచ్ మిక్కి అర్థర్ భారత్‌తో మ్యాచ్ అనంతరం తన అక్కసు వెళ్లగక్కారు. ‘మ్యాచ్ ఐసీసీ ఈవెంట్‌లా జరగలేదు. బీసీసీఐ ఈవెంట్‌లా జరిగింది. స్టేడియంలో 99శాతం బ్లూజెర్సీ వెసుకుని ఇండియాను సమర్థించారు. ప్రేక్షకుల నుంచి పాకిస్థాన్‌కు మద్దతు లభించలేదు. ఇది మా ఆటగాళ్లను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. పాక్ ఓటమికి ఇదొక్కటే కారణం కాదు.. ఆటగాళ్ల ప్రదర్శన కూడా అంచనాలకు తగ్గట్టు లేదు’ అని చెప్పుకొచ్చారు.

    INDvsPAK: టీమిండియా హ్యాట్రిక్‌ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. అనంతరం ఛేజింక్‌కు దిగిన టీమిండిడి 30 ఓవర్లకు 192 విజయ లక్ష్యాన్నిఅందుకుంది. టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ (86) గిల్ (16) కోహ్లీ (16) … Read more

    వారితో అలా ప్రవర్తించకండి: గంభీర్

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. భారత అభిమానులు ఎవరూ ప్రత్యర్థి పాక్‌ను అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని కోరాడు. అతిథిగా వచ్చినవారి పట్ల గౌరవభావం చూపించాలని తెలిపారు.

    INDvsPAK: పాకిస్తాన్ ఆలౌట్

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. టీమిండియా బౌలర్లు బుమ్రా (2) సిరాజ్ (2) హార్థిక్ (2) కుల్థీప్ యాదవ్ (2) జడేజా (2) వికెట్లు తీసుకున్నారు.

    సన్నద్ధతపైనే నా దృష్టి: బుమ్రా

    రేపు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత బౌలర్ బుమ్రా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..’ ఏ మ్యాచ్‌కు ముందు అయినా సరే బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోను నా సన్నద్ధత ఎలా ఉందనేదానిపై దృష్టిసారిస్తా. నా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తా. దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకారం ఇస్తుంది. అయితే, కాస్త స్వింగ్‌ రావడంతో దానిని ఉపయోగించుకొని వికెట్లను తీయగలిగాం’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

    AUS vs SA: ఆసీస్‌ ఘోర ఓటమి

    నేడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాంటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే అలౌల్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్‌ లబుషేన్ (46) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు మిచెల్ మార్ష్‌ (7), డేవిడ్ వార్నర్‌ (13), వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్ (19), పురుగులు చేశారు.

    సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్

    ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ హిట్‌ మ్యాన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 84 బంతులు రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఘటత రో​హిత్‌ శర్మకు దక్కింది. రోహిత్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (6) రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు.

    IND vs AFG: టీమిండియా ఘన విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడింది. తొలుత టాస్ నెగ్గిన ఆఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లుకు ఆఫ్గాన్ 8 వికెట్లను కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 35 ఓవర్లలో నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (131) ఇషాన్ కిషన్ (47) విరాట్ కోహ్లీ (55) శ్రేయస్ అయ్యర్ (25) పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్

    డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ కొలుకున్నాడు. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో రేపు ఆఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ అందుబాటులో ఉండటం లేదు. ఆఫ్గన్‌తో మ్యాచ్ కోసం అతడు ఢిల్లీ వెళ్లలేదని బీసీసీఐ పేర్కొంది. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 14 భారత్, పాక్ మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి తెలుస్తోంది.

    ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణి కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి 199 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ(85), రాహుల్‌(97*) రాణించడంతో టీమిండియా విజయం సాధించిది. స్కోర్లు భారత్‌ 201/4, ఆస్ట్రేలియా 199 ఆలౌట్.