• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు డెంగ్యూ

    ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌కు మందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నారని తెలుస్తోంది. గిల్‌కు ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్ కొనసాగిస్తున్న గిల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరం అయితే భారత్‌కు షాక్ అనే చెప్పాలి.

    ASIA GAMES: ఫైనల్ చేరిన టీమిండియా

    ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో గెలచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేవలం 9.2 ఓవర్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40*, తిలక్ వర్మ 55* రాణించారు. నెపాల్‌పై సెంచరీ చేసిన యశస్వీ జైశ్వాల్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగాడు.

    అనుకున్నదేదీ వెంటనే జరిగిపోదు: రోహిత్ శర్మ

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కెప్టెన్‌ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదు. జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా వారి కెప్టెన్సీ అవకాశం అందలేదు. గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారు. కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అదెంతో ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    WarmUp: భారత్‌- నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు

    భారత్‌- నెదర్లాండ్స్ వార్మప్‌ మ్యాచ్‌ రద్దయింది. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. ఇప్పటికే సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌.. భారత్‌, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అలాగే నేడు టీమిండియా, నెదర్లాండ్స్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌కు కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ్టితో వార్మప్‌ మ్యాచ్‌లు ముగిసాయి. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

    భారత్ బౌలర్లతో జాగ్రత్త: పాక్ మాజీ క్రికెటర్

    భారత్ బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ మాజీ స్పిన్నర్ ఇతిఖాబ్ అలామ్ సూచించాడు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. వారిలో కుల్‌దీప్ మరింత ప్రమాదకరమని పేర్కొన్నాడు. ఇది ఆసియా కప్‌లో భారత్ ఆడిన తీరును చూస్తే అర్థమవుతుందన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్పిన్‌ ఎటాక్ చాలా బాగుందని. తప్పకుండా వరల్డ్‌ కప్‌లోనూ ఇదే ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తారని ఇతిఖాబ్ అభిప్రాయపడ్డాడు.

    టీమిండియా కొత్త జెర్సీ ఇదే?

    వన్డే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. దీనిపై భారత కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ ప్రత్యేకంగా వీడియోను సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. అందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిశారు. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్‌ లోగో, ఎడమవైపు బీసీసీఐ టీమ్‌ లోగో ఉంది. జర్సీ మధ్యలో స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద ఇండియా అని … Read more

    అమెరికాకు చేరుకున్న టీమిండియా

    వెస్టీండీస్‌లో చివరి రెండు టీ20ల్లో భాగంగా టీమిండియా అమెరికాకు చేరుకుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆటగాళ్లు వెస్టిండిస్‌ నుంచి బయలుదేరి ఫ్లోరిడాలోని మియామి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆగస్టు 13, 14 తేదీల్లో నాలుగు, ఐదు టీ20 మ్యాచ్‌లు అమెరికా వేదికగా జరుగనున్నాయి. ????????? Miami ✈️#TeamIndia | #WIvIND pic.twitter.com/SKJTbj0hgS — BCCI (@BCCI) August 10, 2023

    కొత్త జెర్సీలో మెరిసిన టీమ్‌ఇండియా

    వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కొత్త భాగస్వామి అడిడాస్‌ కొత్త జెర్సీ రిలీజ్ చేసింది. భారత జట్టులోని ఆటగాళ్లందరూ కొత్త జెర్సీతో ఫొటోషూట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కొత్త జెర్సీలో భారత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అలాగే ఆస్ట్రేలియా, ఆసియా క్రీడల్లోనూ టీమిండియా ఇదే జెర్సీతో కనిపించనుంది. Test Cricket ✅ On to the ODIs ??#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw — … Read more

    టీమిండియా ప్లేయర్ల సంబరాలు చూశారా?

    ఆసీస్‌తో తొలి వన్డేలో గెలిచిన తర్వాత టీమీండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పటా పటా వికెట్లు పడినప్పటికీ కేఎల్ రాహుల్(75*), రవీంద్ర జడేజా(45*) పోరాటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆసిస్‌పై గెలిచింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. #TeamIndia go 1⃣-0⃣ up in the series! ? ? An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over … Read more

    హోలీ సంబరాల్లో టీమిండియా

    [VIDEO](url): టీమిండియా ఆటగాళ్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లు పండగ సందర్భంగా సరదాగా గడిపారు. ఆటగాళ్లంతా రంగుల్లో మునిగితేలారు. సంబరాలకు సంబంధించిన వీడియోను శుభ్‌మన్‌ గిల్‌ తన ఇన్‌ స్టా ఖాతాలో పంచుకున్నాడు. https://www.instagram.com/reel/CpfQCNhpkuz/?utm_source=ig_web_copy_link