• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: కొండచిలువ కబాబ్

    చికెన్,మటన్, ఫిష్ కబాబ్‌ల వలే.. కొండచిలువ కబాబ్ కూడా ఉంటుందని తెలుసా? అవును. కొండచిలువ తోలు వొలిచి దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కబాబ్ చేస్తారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ 10అడుగులకు పైగా పొడవున్న కొండచిలువ తోలుని చాకుల సాయంతో వొలిచారు. అనంతరం ముక్కలు ముక్కలుగా చేసి మసాలాలు దట్టించారు. కబాబ్‌ని సిద్ధం చేసుకుని లొట్టలేసుకుంటూ ఆరగించారు. కొంచెం కర్రీ కూడా చేసుకున్నారు. మరోసారి వైరల్ అవుతున్న ఈ వీడియోకి 3కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

    మిత్రుడికి వానరం కన్నీటి నివాళి

    తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని ఓ కోతి ఏడ్చి, ముద్దు పెట్టుకుని నివాళి అర్పించింది. ఈ సంఘటన శ్రీలంకలోని బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకుంది. బట్టికలోవాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కోతి స్నేహంగా ఉండేవాడు. రోజూ ఆహారం పెట్టేవాడు. దానితో సరదాగా ఆడుకునేవాడు. కానీ ఇటీవల అతడు మరణించాడు. అతని మృతదేహం దగ్గరికి వెళ్లి రోదించి, ముద్దు పెట్టి నివాళులర్పించింది. దీంతో ఆ దృశ్యాలు చూసి అక్కడున్నవారి హృదయాలు ద్రవించిపోయాయి. இலங்கை: மட்டக்களப்பில், தினமும் உணவளித்த மனிதருக்கு இறுதி அஞ்சலி செலுத்திய … Read more

    ‘మా అమ్మను అరెస్ట్ చేయండి’

    తన చాక్లెట్లను అమ్మ దొంగలిస్తోందని.. ఆమెను అరెస్టు చేయాలని మూడేళ్ల బుడతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననివ్వట్లేదని.. అడిగితే కొడుతుందని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు బాలుడికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు.తల్లిపై ఫిర్యాదు చేయడానికి ఆ బాలుడు తన తండ్రిని వెంట తీసుకెళ్లడం చర్చనీంయాంశం. సరదాగే ఇలా చేసి ఉంటుందని బుడతడి నాన్న మీడియాతో చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की … Read more

    ‘కీర్తి’ ధూమ్ దామ్ దోస్తాన్

    ‘దసరా’ చిత్రంలోని ధూమ్ దామ్ దోస్తాన్ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ మాస్ ద్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. లుంగీ కట్టుకుని, గళ్ల చొక్కా ధరించి, కళ్లజోడు పెట్టుకుని మాస్ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ‘దసరా’ చిత్రంలో నాని సరసన కీర్తి సురేస్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తన్నారు. ఈ సినిమా రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by … Read more

    వృద్ధురాలి కంట్లో ఏకంగా 23 లెన్స్‌లు

    ఓ వృద్ధురాలి కంట్లో ఉన్న 23 కాంటాక్ట్ లెన్స్‌లు డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఈ సర్జరీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓ వృద్ధురాలికి కాంటాక్ట్ లెన్స్‌లు ధరించే అలవాటు ఉంది. అలా రోజుకొకటి చొప్పున 23 లెన్స్‌లు ధరించింది. దీంతో ఇటీవల కంట్లో నొప్పి రావడంతో డాక్టర్లను సంప్రదించింది. ఆమెకు కంటి పరీక్షలు చేయగా పెద్ద మొత్తంలో లెన్స్‌లు ఉన్నట్లు గుర్తించి.. ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. View this post on Instagram A post shared by Ophthalmologist … Read more

    వైరల్‌గా మారిన అమ్మాయిల ఫైట్

    సోషల్ మీడియాలో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ గొడవకు దిగారు. తోటి విద్యార్థినులు ఎవరూ వారిని ఆపలేదు. పైగా వీరి తగాదాను చూస్తూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ వారిద్దరి మద్య గొడవను మరింత ప్రోత్సహిస్తున్నారు. ఈ [వీడియో](url) ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. Kalesh B/w Two Girls In College Canteen (DSCE, … Read more

    కుక్క పిల్లతో బుడ్డోడి ఫుట్‌బాల్

    కుక్క పిల్లతో ఓ బుడ్డోడు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బుడ్డోడు బంతిని తన్నగానే కుక్క పిల్ల కూడా వెంటనే స్పందిస్తోంది. బంతిని తన తలతో కొడుతూ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఒకవైపు ఆ బాలుడు బంతిని తన్నుతుంటే మరోవైపు ఆ శునకం తలతో బంతిని కొడుతోంది. ఇదంతా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. https://twitter.com/buitengebieden/status/1579552188862693378?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579552188862693378%7Ctwgr%5Ec87e0cc4a61c8dd1da5da3a06a61233f4783b189%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fthis-video-of-little-boy-playing-football-with-dog-is-the-cutest-thing-on-internet-today-3423820

    జిమ్‌లో యువతుల బాహాబాహీ

    జిమ్‌లో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ [వీడియో](url)లో.. జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక యువతి తన వంతు కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో మరో మహిళ అక్కడికొస్తుంది. ముందునుంచీ వెయిట్ చేస్తున్న యువతిని అప్పుడే వచ్చిన మహిళ పక్కకు నెట్టేస్తుంది. దీంతో ఆ యువతి కూడా తగ్గేదేలే అన్నట్లు తిరగబడుతుంది. ఒకరినొకరు జట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. వారిని విడదీయటానికి పక్కన ఉన్న వారు తెగ శ్రమించాల్సి వచ్చింది. https://twitter.com/Baharkekalesh/status/1579022442219311104?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579022442219311104%7Ctwgr%5Eae9af34f6ddde2d84461f8b51502175eb5360da0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwomen-pull-each-others-hair-over-argument-in-gym-catfight-caught-on-cctv-watch-viral-video-au60-799373.html

    బ్రెసీలియాలో మొసళ్ల దండయాత్ర

    బ్రెజిల్‌లోని ఒక సముద్ర తీరంలో వందల కొద్దీ మొసళ్లు సేద తీరుతున్న [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెసీలియా తీరంలో భారీ సంఖ్యలో మొసళ్లు విశ్రాంతి తీసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా కెన్ రుత్కోవ్‌స్కీ అనే వ్యక్తి సెప్టెంబర్ 15న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24 వేల రీట్వీట్లు చేశారు. Viral video shows crocodiles ? “ invading “ Brazilian beach !Here is … Read more

    కారు దిగి పరుగెత్తిన వైద్యుడు

    పేషంట్ ప్రాణాల్ని కాపాడటానికి ఓ వైద్యుడు చేసిన సాహసం ఔరా అనిపిస్తోంది. బెంగుళూరులో ఓ రోగికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. డాక్టర్ నందకుమార్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. అది క్లియర్ కావటానికి చాలా సమయం పడుతుందని గ్రహించిన వైద్యుడు.. కారు దిగి పరుగెత్తడం ప్రారంభించారు. ఇలా మూడు కిలోమీటర్లు పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆయనే పంచుకుంటూ.. ‘ఉద్యోగం చేయాలంటే కొన్నిసార్లు పరుగెత్తాలి’ అని ట్వీట్ చేశాడు. వైద్యుడి ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మరి మీరేమంటారు? @BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better … Read more