Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్

    Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్‌ కామెంట్స్‌ వైరల్

    October 23, 2024

    తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వరుస చిత్రాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా బికినీపై ఆమె చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

    రీసెంట్‌గా ఆమె చేసిన ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌‘ సీజన్‌ 2 ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో బికినీలో కనిపించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. 

    ఆ బికినీకి సంబంధించిన ఫొటోలను సైతం తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి.

    బికినీలో ఆమె లుక్‌ పర్పెక్ట్‌గా ఉందంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

    ప్రతీ యాక్టర్‌కు అందంగా, ఫిట్‌గా ఉండటం అవసరమని తేజస్వి స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోనే తాను తొలిసారి బికినీ వేశానని గుర్తుచేసింది. దీనిని గొప్ప అవకాశంలా భావించాని చెప్పింది.

    ఓటీటీ సిరీస్‌కు బికిని అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తానేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్లమీద తిరగట్లేదని, సన్నివేశం కోసం మాత్రమే అలా చేశానని చెప్పింది. 

    ఇక తేజస్వి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో జర్నలిజం చదివింది. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించింది. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్‌ అటాక్‌’ వంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. 

    2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది. 

    కేరింత‘ చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ లభించలేదు. 

    దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన తేజస్వి మదివాడ అక్కడ పలు షోలలో హల్‌చల్‌ చేసింది. 2018లో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది. 

    తర్వాత స్టార్‌మాలో ‘ది గ్రేటర్‌ తెలుగు లాఫర్‌ ఛాలెంజ్‌’ సీజన్‌ 1లో కనిపించి సందడి చేసింది. 2022లో ‘బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌ 1’లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది. 

    ఇటీవల ‘హైడ్‌ ఎన్‌ సీక్‌’ (Hide N Seek) మూవీలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌ 2’ సిరీస్‌లో చాలా ఆశలు పెట్టుకుంది. 

    మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకునే పనిలో తేజస్వి ఉంది. ఇందుకోసం తన హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

    ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తేజస్వి ఏ ఫొటో షేర్‌ చేసినా దానిని వెంటనే షేర్ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version