సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు

    సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు

    January 31, 2023

    సెప్టెంబ‌ర్‌లో చాలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క్యూ క‌డుతున్నాయి. మొత్తం 17 సినిమాలు వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతున్నాయి. బ్ర‌హ్మాస్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి బ‌డా సినిమాల‌తో పాటు, మీడియం, చిన్న సినిమాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రి సెప్టెంబ‌ర్ నెల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న ఆ సినిమాల జాబితాను ఒక‌సారి ప‌రిశీలిస్తే..

    రంగరంగ వైభవంగా: సెప్టెంబ‌ర్ 2

    వైష్ణ‌వ్ తేజ్, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి.

    ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో: సెప్టెంబ‌ర్ 2

    జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ క‌థ అందించిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమా కూడా సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఖుషి సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ముఖ్యంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ  దర్శకత్వం వహిస్తున్నారు.

    ఆకాశ వీధుల్లో: సెప్టెంబ‌ర్ 2

    గౌత‌మ్ కృష్ణ‌, పూజిత్ పొన్నాడ‌, స‌త్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ ఆకాశ వీధుల్లో. ఈ సినిమాకు గౌత‌మ్ కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం కూడా సెప్టెంర‌బ్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    బ్ర‌హ్మాస్త్ర: సెప్టెంబ‌ర్ 9

    అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న పాన్ ఇండియా చిత్రం బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం శివ సెప్టాంబ‌ర్ 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భ‌ట్, నాగార్జున‌, అమితాబ్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

    ఒకే ఒక జీవితం: సెప్టెంబ‌ర్ 9

    శ‌ర్వానంద్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడే. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. అక్కినేని అమ‌ల కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా కూడా సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. 

    నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని: సెప్టెంబ‌ర్ 9

    యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మూవీ నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని. కార్తిక్ శంక‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    గుర్తుందా శీతాకాలం: సెప్టెంబ‌ర్ 9

    స‌త్య‌దేవ్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ ల‌వ్ మాక్‌టైల్‌కు రీమేక్‌గా ఇది తెర‌కెక్కింది. 

    కొత్త కొత్త‌గా: సెప్టెంబ‌ర్ 9

    కొత్త న‌టీన‌టులు అజ‌య్‌, విర్తి వ‌గాన్ జంట‌గా న‌టించిన చిత్రం కొత్త కొత్త‌గా. హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

    లాఠీ: సెప్టెంబర్ 15

    విశాల్ హీరోగా న‌టించిన చిత్రం లాఠీ. వ‌ప‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా ఇందులో విశాల్ క‌నిపించ‌నున్నాడు. సున‌య‌న హీరోయిన్. ఈ యాక్ష‌న్ డ్రామాకు వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: సెప్టెంబ‌ర్ 16

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఇది తెర‌కెక్కింది.

     

    శాకిని డాకిని: సెప్టెంబ‌ర్ 16

    నివేతా థామ‌స్, రెజీనీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఇచ‌త్రం శాకిని డాకిని. ఇది సౌత్ కొరియా మూవీ మిడ్‌నైట‌ర్ ర‌న్న‌ర్స్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    క్రేజీ ఫెలో: సెప్టెంబ‌ర్ 16

    ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన మూవీ క్రేజీ ఫెలో. కొత్త డైరెక్ట‌ర్ ఫ‌ణి కృష్ణ సిరికి ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నాడు. దిగంగ‌నా సూర్య‌వంశీ, మిర్నా మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

    కృష్ణ వ్రింద విహారి: సెప్టెంబ‌ర్ 23

    నాగ‌శౌర్య‌, శ‌ర్లీ సేతియా జంట‌గా న‌టించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రం మొత్తానికి సెప్టెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అనీశ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

    అల్లూరి: సెప్టెంబ‌ర్ 23

     శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తున్న మూవీ అల్లూరి. ఇందులో శ్రీ విష్ణు ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌మిస్తున్నాడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా వ్య‌వ‌హరించాడు.

    దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌: సెప్టెంబ‌ర్ 23

    శ్రీ సింహా కోడూరి హీరోగా న‌టిస్తున్న మూవీ దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌. స‌తీష్ త్రిపుర దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రీతి అర్సానీ హీరోయిన్‌గా న‌టించింది. 

    రావణాసుర: సెప్టెంబ‌ర్ 30

    మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా న‌టించిన చిత్రం రావ‌ణాసుర‌. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌టుడు సుశాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

    పొన్నియ‌న్ సెల్వ‌న్: సెప్టెంబ‌ర్ 30

    చాలాకాలం గ్యాప్ త‌ర్వాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిరత్నం తెర‌కెక్కించిన చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1 సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది. ఇందులో ఐశ్వ‌ర్య‌రాయ్, విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తి, త్రిష  ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version