ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు

    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు

    March 27, 2023

    గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది.

    దసరా- మార్చి 30

    నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్‌ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    OTT విడుదలలు

    శ్రీదేవి శోభన్ బాబు

    సంతోశ్‌ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీదేవీ శోభన్‌ బాబు. గత నెలలో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది.

    ఓటీటీ: డిస్పీ+హాట్‌స్టార్‌

    తేదీ : మార్చి 30

    అమిగోస్‌

    కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినంతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో జనాలకు బాగానేే వినోదాన్ని పంచింది. కల్యాణ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే   ఓటీటీలో సందడి చేయబోతోంది.

    ఓటీటీ: నెట్‌ ఫ్లిక్స్‌

    తేదీ: ఏప్రిల్‌ 01

    అసలు

    రవిబాబు దర్శకత్వంలో ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అసలు’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా కథ ఓ అమ్మాయి జర్నీ, అందులోని సవాళ్ల చుట్టూ జరిగే థ్రిల్లర్‌గా ఉంటనుంది.

    ఓటీటీ: ఈటీవీ విన్‌

    తేదీ: ఏప్రిల్ 05

    అన్ని ఓటీటీ విడుదలలు

    TitleCategoryLanguagePlatformRelease Date
    GODARIDocumentaryTeluguAhaMarch 31
    SattiGaani RendekaraluMovieTeluguAhaApril 01
    My Little Pony- Tell Your TaleWeb seriesenglishNetflixMarch 27
    Emergency NYCWeb seriesenglishNetflixMarch 29
    UnseenmovieenglishNetflixMarch 29
    Almost Pyaar with DJ MohbatMovieHindiNetflixMarch 31
    Murder Mistery 2MovieEnglishNetflixMarch 31
    Company of HeroesMovieEnglishNetflixApril 01
    Jar Head 3 – The SiegeMovieEnglishNetflixApril 01
    ShehzadaMovieHindiNetflixApril 01
    Spirit UntamedMovieEnglishNetflixApril 01
    WarSailerSeriesEnglishNetflixApril 02
    Avatar 2MovieenglishDisney+HotstarMarch 28
    GaslightMovieHindiDisney+HotstarMarch 31
    All That BreathesMovieHindiDisney+HotstarMarch 31
    AgilanMovieTamilZee5March 31
    AyothiMovieTamilZee5March 31
    United Kache MovieHindiZee5March 31
    Tetris MovieEnglishApple TvMarch 31
    MummiesMovieEnglishBookMyShowMarch 27
    BhageeraMovieTamilMobiMarch 31
    Indian SummersMovieHindiMX PlayerMarch 27
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version