• TFIDB EN
  • బ్రో
    U/ATelugu
    మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం స...read more

    How was the movie?

    తారాగణం
    పవన్ కళ్యాణ్
    కాల దేవుడు
    సాయి ధరమ్ తేజ్
    మార్కండేయులు "మార్క్"
    కేతిక శర్మ
    మార్క్ ప్రేమ ఆసక్తి
    రోహిణి
    మార్క్ తల్లి
    ప్రియా ప్రకాష్ వారియర్
    వీణ
    బ్రహ్మానందం
    శాస్త్రి
    సుబ్బరాజు
    రమ్య సోదరుడు
    వెన్నెల కిషోర్
    మార్క్ బాస్
    యువ లక్ష్మిగాయత్రి
    అలీ రెజా
    ద్విపాత్రాభినయంలో
    తనికెళ్ల భరణి
    కృష్ణమూర్తి
    పృధ్వీ రాజ్
    "సాంబాబు" గా అతిధి పాత్రలో
    సూర్య శ్రీనివాస్అరుణ్
    రాజా చెంబోలురికీ
    దేవిక సతీష్ఆండ్రియా/మహాలక్ష్మి
    పమ్మి సాయిక్యాబ్ డ్రైవర్
    సంజయ్ స్వరూప్వైద్యుడు
    శ్రీనివాస రెడ్డి
    పాథాలజిస్ట్
    రాజశ్రీ నాయర్రికీ తల్లి
    సముద్రకని
    శంకరన్న పాత్రలో అతిధి పాత్రలో నటించారు
    ఊర్వశి రౌటేలా
    సిత్ర మంజరి పాత్రలో అతిధి పాత్రలో నటించింది
    సిబ్బంది
    సముద్రకని
    దర్శకుడు
    వివేక్ కూచిబొట్లనిర్మాత
    T. G. విశ్వ ప్రసాద్నిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    స్క్రీన్ ప్లే
    సుజిత్ వాసుదేవ్
    సినిమాటోగ్రాఫర్
    నవీన్ నూలి
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.  అలా తెరమీదకి.. ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.   https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20 స్టోరీ ఇదే.. పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్‌ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.   https://youtu.be/stcCZWCBegk త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా? మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది.  వాస్త‌వాల‌కు, భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.  https://www.youtube.com/watch?v=yNnJ9de339k 12 భాషల్లో చిత్రీకరణ డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.  https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 26 , 2023
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    యంగ్‌ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు! శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ ఫిల్మ్‌ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) సైతం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్‌ బుష్‌’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్‌ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్‌ షో 23.37%, సెకండ్‌ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.  బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్‌ బుష్‌’ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.  ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి. 
    మార్చి 23 , 2024
    కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    కేతిక శర్మ తెలుగులో గ్లామర్ క్లీన్‌గా పేరొందింది. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. మరి ఈ హాట్ డాల్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Ketika Sharma)  ఆసక్తికరమైన విషయాలు మీకోసం..  కేతిక శర్మ ఎప్పుడు పుట్టింది? 1995, డిసెంబర్ 24 న జన్మించింది  కేతిక శర్మ తొలి సినిమా? రొమాంటిక్(2021)  కేతిక శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు  కేతిక శర్మ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ కేతిక శర్మ ఏం చదివింది? డిగ్రీ కేతిక శర్మ అభిరుచులు? జిమ్ చేయడం, ట్రావెలింగ్, మోడలింగ్ కేతిక శర్మకు ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ కేతిక శర్మకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్, వైట్ కేతిక శర్మకు ఇష్టమైన ప్రదేశం బ్యాంకాక్ కేతిక శర్మకి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ కేతిక శర్మకి ఇష్టమైన హీరోయిన్? ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే కేతిక శర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది కేతిక శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ketikasharma/?hl=en కేతిక శర్మ సిగరెట్ తాగుతుందా? స్మోకింగ్ అలవాటు ఉంది. కేతిక శర్మ మద్యం తాగుతుందా? అవును, తాగుతుంది. https://www.youtube.com/watch?v=ILQ8wRqu5EI
    ఏప్రిల్ 06 , 2024
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం. అవికా గోర్ పూర్తి పేరు? అవికా సమీర్ గోర్ అవికా గోర్ ఎందుకు ఫేమస్ అవికా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అవికా గోర్ వయస్సు ఎంత? 1997,  జూన్ 30న జన్మించింది అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా? ఉయ్యాల జంపాల(2013) అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా? కేర్‌ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009) అవికా గోర్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు  అవికా గోర్ ఎక్కడ పుట్టింది? ముంబై అవికా గోర్ అభిరుచులు? ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్ అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం? పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్ అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా? మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అవికా గోర్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అవికా గోర్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. అవికా గోర్ తల్లిదండ్రుల పేరు? సమీర్ గోర్, చేతన గోర్ అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/avikagor/?hl=en అవికా గోర్ పెట్  పేరు? షీరో https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
    ఏప్రిల్ 02 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.  https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
    బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. రోజుకో అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. హిందీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోవాలని ఉబలాటపడిన అందాల తార ఊర్వశి రౌటేలా.. అక్కడ విఫలమవడంతో తెలుగులో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతోంది. బ్రో, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌ల్లో నర్తించి తెలుగు ఫ్యాన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ కుర్ర అందం.. 2015 మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుంది. అదే ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో కూడ పాల్గొంది సింగ్ సాబ్ ది గ్రేట్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీలో కూడ నటించింది తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడ నటించింది గ్లామరస్ ఫోజులతో కుర్రకారు మనసు దోచుకున్న ఊర్వశికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 69 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా దక్కింది. ఇన్ని ఘనతలు ఉన్నా ఊర్వశికి రౌటేలాకు మాత్రం రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన సరైన హిట్‌ లేక నేల చూపులు చూస్తోంది. సినిమాలు లేకపోతేనేం.. సోషల్ మీడియాలో తన అందాలను దోరగా వడ్డిస్తూ కుర్రకారును పెద్దసంఖ్యలో ఫాలోవర్లుగా మార్చుకుంటోంది.
    డిసెంబర్ 01 , 2023
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.  సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
    గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సలార్‌ (Salaar) పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్‌’, క్రిస్మస్‌ కానుకగా విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  యానిమల్‌ (Animal) అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.  వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.  ఆదిపురుష్ (Adipurush) ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది.  ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.  వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.  భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'భగవంత్‌ కేసరి'. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. బ్రో (Bro) పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.  దసర (Dasara) నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల మార్క్‌ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బేబీ (Baby) చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్‌వైడ్‌గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం. 
    డిసెంబర్ 27 , 2023
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పలు వివాదాలు టాలీవుడ్‌ను షేక్‌ చేశాయి. తారలు, సినీ ప్రముఖుల మధ్య తలెత్తిన ఈ వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాటాల తూటాలను పేల్చేలా చేశాయి. ఇంతకీ ఆ కాంట్రవర్సీస్‌ ఏంటి? అందుకు కారణమైన నటీనటులు ఎవరు? తదితర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో 'వీరసింహారెడ్డి' చిత్ర ప్రమోషన్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారారు. ఇది అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నాగచైతన్య, అఖిల్‌ సైతం ఈ అంశంపై ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై జూ.ఎన్టీఆర్‌ స్పందించకపోవడం పైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి. సమంత vs చిట్టిబాబు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha) మయోసిటిస్‌ (Myositis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే 'శాకుంతలం' సినిమా విడుదల సందర్భంగా దీనిపై నిర్మాత చిట్టిబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు వచ్చిన వ్యాధి సాధారణమైనదేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఆమె సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించింది. కొందరికి చెవుల్లో జుట్టు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్‌ అని చిట్టిబాబును ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చింది.  విష్ణు vs మనోజ్‌ మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ ఏడాది తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు తన మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. అయితే రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు. కారణం విష్ణు ఇప్పటివరకూ ఎలాంటి రియాలిటీ షో చేయకపోవడమే. https://twitter.com/TeluguBitlu/status/1639265933175713800 పవన్‌ vs అంబటి పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో' (Bro). ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ ఓ పాత్ర పోషించాడు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని చిత్ర నిర్మాత, నటుడు పృథ్వీ స్పష్టం చేశారు.   విజయ్‌ దేవరకొండ vs అనసూయ అనసూయ భరద్వాజ్- విజయ్ దేవరకొండల వివాదం కూడా ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ‘ఖుషి’ చిత్ర పోస్టర్‌పై 'ది విజయ్ దేవరకొండ' అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్‌ని ఉద్దేశపూర్వకంగానే తాను టార్గెట్ చేశానని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని ఆమె ఆరోపించింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదని చెప్పింది. అందుకే తాను విజయ్‌పై విమర్శలు చేసినట్లు వివరించింది.  దిల్‌రాజు vs సి.కళ్యాణ్‌ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు - సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ సైతం విడుదల చేశారు. ఇది అప్పట్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ విజయం సాధించింది.  బలగం స్టోరీ వివాదం ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశారు. వేణు తన స్టోరీని కాపీ చేశాడని ఆరోపించారు. అయితే వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని సమాధానం ఇచ్చారు. కోర్టులో తేల్చుకోమని సవాలు సైతం విసిరారు.  పుష్ప నటుడు అరెస్టు పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ ఫ్రెండ్‌గా నటించి పాపులర్‌ అయిన జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో అతడ్ని డిసెంబర్‌ 6న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడం కోసం ఫొటోలతో బెదిరించినట్లు పోలీసుల వద్ద జగదీష్ అంగీకరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు. 
    డిసెంబర్ 18 , 2023
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    మిల్క్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రకృతి ఒడిలో అందాలను ఒలకబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో గ్లామర్ షో చేసింది.   తడి చీరకట్టు అందాలతో హీటెక్కించింది. క్రీమ్ కలర్ చీరను పద్దతిగా కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నడుమమందాలను చూపిస్తూ కైఫెక్కించింది.  తడిసిన ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తడిచిన చీరలో నడుమందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.  ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయం చేస్తోంది. తాజాగా ప్రియా తన హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి.  ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే ఫ్లయింగ్ కిస్‌ గన్‌తో ఫిల్మ్ మేకర్లను కూడా ఆకర్షించింది.  ప్రస్తుతం ఈ భామ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.  క్లీవేజ్ షో చేయడంలో ఈ భామను మించిన హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు.  ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కుర్రకారుపై అందాల దాడి చేస్తూనే ఉంటుంది.  నాజుకైన నడుమందాలను ఇంపుగా వడ్డీస్తూ కొంటె చూపులతో సెగలు పుట్టిస్తుంటుంది ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ దాదాపు సౌత్‌లోని అన్ని భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగులో నితిన్ సరసన చెక్‌ మూవీలో యువ హీరో తేజా సజ్జాకు జోడీగా ఇష్క్‌ సినిమాలో నటించింది. ఇక తన కేరీర్ గురించి చెబుతూ.. తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ప్రియా పాపులర్ అయింది. ఈ సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది. 
    అక్టోబర్ 17 , 2023
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ.   బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.  బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో  ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao MovieHindiJio CinemaAugust 25Invasion 2 SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .  సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.  రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు. 
    ఆగస్టు 11 , 2023
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. రెండేళ్లు.. అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.  https://twitter.com/GunturKaaram/status/1672478971827720192 మూడేళ్లు.. అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.  https://twitter.com/GunturKaaram/status/1664273686810198024 గుంటూరు కారం 2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.  కారణాలు.. సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.  https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192 త్రివిక్రమ్ డైవర్ట్? ‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.  https://twitter.com/GunturKaaram/status/1664248261442678784 నిరాశలో ఫ్యాన్స్ సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
    ఆగస్టు 09 , 2023
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.  దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.  ఈరోజు  #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.  ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.  జులై  'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.  చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.  పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 
    జూలై 04 , 2023
    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?
    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోగా సెటిల్‌ అయిన సమయంలో చిరు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లారు. అక్కడ పెద్దగా కలిసిరాకపోవడంతో తిరిగి తనకు ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి తిరిగి వచ్చేశారు. అలాగే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేశారు. అయితే చిరు మెుదటి ఇన్నింగ్స్‌తో పోలిస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ రీమెక్స్‌ చుట్టూ తిరుగుతోంది. రీఎంట్రీ తర్వాత చిరు తొలి చిత్రం ‘ఖైదీ 150’ నుంచి రీసెంట్‌ భోళాశంకర్‌ వరకూ మెుత్తం 6 సినిమాలు చేయగా అందులో మూడు రీమెక్సే ఉన్నాయి. మెగాస్టార్‌ చిరు వరుసగా రీమెక్ సినిమాలు చేయడం ఫ్యాన్స్‌కు అంతగా రుచించడం లేదు. స్ట్రైయిట్ చిత్రాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. దీనికితోడు చిరు చేస్తున్న చిత్రాలన్నీ తమిళం, మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచినవే. దీంతో ఆ సినిమాలను సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరీ మూవీ లవర్స్‌ చూసేస్తున్నారు. ఇది చిరు సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. అందువల్లే చిరు తీసిన రీమెక్‌ సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. చిరు స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టలేక చతికిలపడుతున్నాయి. చిరు తన సెకండ్ ఇన్సింగ్స్‌లో చేసిన రీమెక్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ్‌లో మురుగదాస్ డైరెక్ట్ చేయగా తెలుగులో వీవీ వినాయక్ రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ టాక్ తెచ్చుకుంది. గాడ్‌ ఫాదర్‌ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా చిరు ‘గాడ్ ఫాదర్‌’ సినిమా చేశారు. లూసీఫర్‌లో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రను తెలుగులో చిరు చేశారు. ఈ సినిమా  గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది.  భోళా శంకర్  చిరు హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా తమిళంలో అజిత్‌ హీరోగా చేసిన ‘వేదాలం’ చిత్రానికి రీమేక్‌. భోళాశంకర్‌లో చిరు సరసన తమన్నా నటించగా, చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేసింది. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.  బ్రో డాడీ మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బ్రో డాడీ’ సినిమాను కూడా చిరు రీమేక్‌ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
    జూన్ 02 , 2023
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు  అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.  ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్‌ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.  జాతిరత్నాలు ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్‌ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు. డీజే టిల్లు డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్‌ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.  హుషారు మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్‌ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్‌ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.  బ్రోచెవారెవరురా  స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు. ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్‌ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది. మిషన్ ఇంపాజిబుల్‌ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.  హృదయం కాలేజ్‌ లైఫ్, లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్‌ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్‌ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.  చిచ్చోరే ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది. రొమాంచనమ్ హారర్‌ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్‌ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్‌ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్‌ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్‌ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు. మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 21 , 2023
    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
    విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22 థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, విశ్వక్‌సేన్ హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా, యాక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.  దర్శకుడు: విశ్వక్‌సేన్  నటీ నటులు: విశ్వక్‌సేన్, నివేథా పెతురాజ్, రావు రమేశ్, రోహిణి, తదితరులు సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, జార్జ్ విలియమ్స్ కథేంటి? కృష్ణ దాస్(విశ్వక్‌సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్‌సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్‌గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది?  అందరికీ తెలిసిన ఫార్ములానే కావడంతో కథలో కొత్తదనం కనిపించలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించాయి. నివేదాతో లవ్ ట్రాక్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తానికి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్ధంలో తొలి పది నిమిషాలు అది కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు రావడం మొదలవుతాయి. అయితే, కథలో అవసరమైన వాటికన్నా ఎక్కువ ట్విస్టులు ఉండటం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ఊహిస్తారు. ఎమోషనల్ సీన్స్‌ మరింత మెరుగ్గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  ఎవరెలా చేశారు?  విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో అలరించాడు. తనలోని భిన్న కోణాలను చూపించడానికి ఈ రెండు పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. నటన పరంగా విశ్వక్‌ ఆకట్టుకున్నాడు. బోల్డ్ డైలాగ్‌లతో మాస్ ఆడియెన్స్‌ని మురిపించాడు. నివేదా పేతురాజ్ అందంగా కనిపించింది. రావు రమేశ్, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహేశ్, హైపర్ ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ మెప్పించాడు.  టెక్నికల్‌గా సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీని నడిపించడానికి విశ్వక్‌ బాగానే శ్రమించాడు. తనలోని డైరెక్టర్‌కు పనిచెప్పాడు. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘మావా బ్రో’, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ పాటలు తెరపై సందడి చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ విశ్వక్‌సేన్ నటన సంగీతం నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ఎక్కువ ట్విస్టులు స్క్రీన్ ప్లే ఫైనల్‌గా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దాస్‌.. క్లాస్ ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చాడు. రేటింగ్: 2.5/5
    మార్చి 22 , 2023

    @2021 KTree