యంగ్ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు!
శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన ‘ఓం భీమ్ బుష్‘ సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్ డే 1 కలెక్షన్స్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సాక్నిక్ లెక్కల ప్రకారం
ప్రముఖ ఫిల్మ్ వెబ్‌సైట్ సాక్నిక్ (Sacnilk) సైతం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్ బుష్’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్ షో 23.37%, సెకండ్ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
యంగ్ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్ బుష్ థ్రియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్ బుష్’ హిట్ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం