జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈరోజు #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్ తన అకౌంట్‌కు జత చేశారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు.
అందుకేనా ఇన్‌స్టా?
ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.
జులై ‘బ్రో’ నెల
మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ ఈనెల 28న విడుదల కానుంది. చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను ‘బ్రో’ నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.
అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!