• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలంగాణలో 25-40 స్థానాల్లో పోటీ చేస్తాం: పవన్‌

  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ తమ పార్టీ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము పిరమిత సంఖ్యలో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్‌ అన్నారు. 25-40 అసెంబ్లీ స్థానాలు, 7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. భాజపాతో తమకు పొత్తు ఉండబోదని కానీ తమ మద్దతు మాత్రం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా పొత్తులకు వస్తే సంతోషిస్తామని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇవాళ తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజ చేసిన అనంతరం పవన్‌ ఈ వ్యాఖ్యలు … Read more

  ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కళ్యాణ్

  TS: హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో హకీంపేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ లారీ రిపేర్ కావడంతో హకీంపేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. బస్సు యాత్ర కోసం సిద్ధం చేసిన ‘వారాహి’ వాహనానికి పూజ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టు వెళ్తున్న సంగతి తెలిసిందే. పూజ అనంతరం జనసేనాని కార్యకర్తలతో కలిసి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

  జనసేనలోకి ‘కన్నా’; అక్కడి నుంచే పోటీ?

  ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా కన్నాకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పొసగడం లేదు. ఈ క్రమంలో ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కన్నా కలిశారు. ఇక అప్పటి నుంచే ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

  పవన్‌ని సీఎం చేయడమే మా లక్ష్యం: నాగబాబు

  పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యం అంటూ ఆయన సోదరుడు నాగబాబు వెల్లడించారు. కర్నూలులో జరిగిన వీర మహిళల సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసలు పార్టీయే కాదని మండిపడ్డారు. పొత్తులపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారంటూ స్పష్టం చేశారు. వైసీపీలా తాము దిగజారి మాట్లాడబోమని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్‌‌పై పోటీ చేస్తానన్న ఆలీ కామెంట్స్‌పై స్పందించడం అనవసరమని వ్యాఖ్యానించారు. ఆలీ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

  పవన్‌పై ఆలీ ఇక్కడేనా పోటీ చేసేది?

  AP: వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ఆలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ భీమవరం, అనంతపురం అర్భన్, పిఠాపురం లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలు వైసీపీ సిట్టింగ్ స్థానాలు కావడంతో బలమైన పోటీ ఉండనుంది. అయితే, ఆలీ నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఈ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి. అది ఖరారు కావాలంటే ముందుగా జనసేనాని పోటీపై ఓ … Read more

  పవన్ కళ్యాణ్ బుర్ర వాడాలి: కేఏ పాల్

  పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. దేవుడు తెలివి తేటలు ఇచ్చాడని.. వాటిని సరిగ్గా వాడాలని జనసేన అధినేతకు కేఏ పాల్ సూచించారు. లోకేష్‌ను కాదని సీఎం పదవిని పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. తనకు ఓట్లు వేయలేదంటూ ప్రజలను పవన్ కళ్యాణ్ నిందించడం సరికాదన్నారు. ‘ఓట్ల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెబుతావా. సీఎం పదవి కోసం పొత్తు పెట్టుకుంటావా? రేపు ఎవరైనా కేంద్ర మంత్రి పదవి, ఎంపీ సీటు ఇస్తానంటే … Read more

  వారాహికి ఈ నెల 24న వాహనపూజ

  TS: బస్సు యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం చేయించుకున్న ‘వారాహి’ వాహనానికి ఈ నెల 24న పూజ నిర్వహించనున్నారు. కొండగట్టు ఆలయం వద్ద ‘వారాహి’కి పూజ చేయనున్నట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహనపూజ అనంతరం తెలంగాణలోని జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ‘అనుష్టుప్ నారసింహ యాత్ర’ను పవన్ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 32 నారసింహ పుణ్యక్షేత్రాల్లో ఈ యాత్ర జరగనుంది. ధర్మపురి నుంచి పవన్ ఈ … Read more

  పవన్‌ కల్యాణ్…మీ భాయిజాన్‌ను చూసుకోండి: ఆర్జీవీ

  పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబుపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. “సోదరుడు కాబట్టి చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు నాగబాబు ముఖ్యమై ఉండొచ్చు గానీ నాకు కాదు. నేను జనసేన, పవన్ మీద వ్యాఖ్యలు కేవలం అభిమానిగా చేశాను. నాగబాబు లాంటి వారిని సలహాదారుగా పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జనమే చెబుతారు” అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

  ఏపీలో ఎమర్జెన్సీ మించిన పరిస్థితి

  ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి దాదాపు 2 గంటలపాటు రాష్ట్రంలో తాజాపరిస్థితులపై చర్చించారు. ఎవ్వరూ సమావేశాలు పెట్టకూడదని జీవో ఇచ్చి.. వైసీపీ వాళ్లు మాత్రం యథేచ్ఛగా చేస్తున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్రేనని విమర్శించారు. దీన్ని పోలీసులు అమలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాసిందని పవన్‌ ఆక్షేపించారు.

  జోగయ్య దీక్షకు జనసేన సంఘీభావం

  AP: కాపు రిజర్వేషన్ల కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామ జోగయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జోగయ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘జోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది. ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని పవన్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జోగయ్య నేటి నుంచి నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. కానీ, ఆదివారం … Read more