• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!

    తాజాగా శాండల్‌వుడ్‌ ఎంట్రీకి సునీల్ సిద్ధమయ్యాడు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు.

    జనసేన నేతలతో నేడు పవన్ భేటీ

    జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్‌ నేడు సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశంపై చర్చ జరిపే అవకాశం ఉంది. దసరా తరువాత వారాహి యాత్ర చేపట్టే యోచనలో పవన్‌ ఉన్నారు. షెడ్యూల్ ఖరారుపై పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో పార్టీ నాయకులు వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేయనున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు దిశానిర్దేశం చేయనున్నారు.

    తెలంగాణలో పోటీపై 2 రోజుల్లో చెప్తా: పవన్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈసారి పోటీ చేయకపోతే.. క్యాడర్ బలహీనమయ్యే ప్రమాదం ఉందని పవన్‌కు నేతలు వివరించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్, రెండు మూడు రోజుల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

    సునీల్‌ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌ వీడియో

    టాలీవుడ్ నటుడు సునీల్ ప్రధాన పాత్రలో నటించిన భువన విజయమ్‌ సినిమా నుంచి మరో ప్రమోషనల్‌ వీడియో విడుదలైంది. ‘సోల్‌ ఆఫ్ భువన విజయమ్‌’ పేరుతో ఈ వీడియోను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. యలమంద చరణ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.

    సునీల్‌ బర్త్‌ ఆఫ్‌ భువన విజయం

    సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భువన విజయ్‌ చిత్రబృందం ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే టీజర్, థీమ్‌ సాంగ్‌తో ఆకట్టుకున్న యూనిట్‌.. ఇప్పుడు బర్త్‌ ఆఫ్ భువన విజయం పేరుతో వీడియో విడుదల చేసింది. ఇందులో సునీల్ కొత్త కథల కోసం వెతుకుతుంటే చాలా మంది స్టోరీలు చెబుతారు. ఇలా రెగ్యులర్‌గా కాదు మంచి కథ కావాలని అన్నప్పుడు భువన విజయం టైటిల్ వేశారు. చివర్లో వెన్నెల కిషోర్‌ ఫన్నీ బిట్‌ కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. https://youtube.com/watch?v=81ky0qxbyiU%26t%3D60s

    ఒక్కసారి జనసేనవైపు చూడండి: పవన్ కల్యాణ్

    AP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం. నా కడశ్వాస వరకు నా కుటుంబం కన్నా మీరెక్కువ, ప్రజలెక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెబుతున్నా, రాజకీయాలను వదిలేదే లేదు. నిలబడే ఉంటాం. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం. ఇవ్వకపోతే.. పదవి లేకున్నా సేవచేస్తాం’ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి – … Read more