• TFIDB EN
  • నింద
    U/ATelugu
    ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. దీంతో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బాధతో కన్నుమూస్తారు. ఈ కేసులో అసలైన నేరస్థుడిని పట్టుకునేందుకు జడ్డి కొడుకు బయలు దేరతాడు. ఆరుగురు అనుమానుతుల్ని కిడ్నాప్‌ చేసి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?

    వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అన...read more

    How was the movie?

    తారాగణం
    వరుణ్ సందేశ్
    తనికెళ్ల భరణి
    శ్రేయా రాణి రెడ్డి
    భద్రం
    సిద్ధార్థ్ గొల్లపూడి
    చత్రపతి శేఖర్
    అన్నీ
    సూర్య
    అరుణ్ దలై
    మైమ్ మధు
    సిబ్బంది
    రాజేష్ జగన్నాధందర్శకుడు
    రాజేష్ జగన్నాధంనిర్మాత
    కథనాలు
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్‌ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్‌ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్‌ బాయ్‌ పాత్రలే చేసిన వరుణ్‌ సందేశ్‌.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్‌ ఉద్యోగిగా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్‌ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్‌ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్‌ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ వరణ్‌ సందేశ్‌ నటననేపథ్య సంగీతంసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    జూన్ 21 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.  హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.  జూన్‌ 21న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.  బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్‌ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్‌-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు. గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం.  ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.   అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు.  https://twitter.com/PrasadAGVR/status/1540383278166814720?s=20 ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌  కూడా ఆసక్తికరంగా ఉంది.  మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్‌ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
    మార్చి 29 , 2023
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    గత శుక్రవారం (జూన్‌ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్‌ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్‌లో వాటి కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.  ‘మనమే’ 3 డేస్‌ కలెక్షన్స్‌ శర్వానంద్‌ లేటెస్ట్ మూవీ 'మనమే'కు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్‌లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్‌ (Gross) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్‌ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి. కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  వీకెండ్‌లో నిరాశ పరిచిన ‘సత్యభామ’ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సత్యభామ'. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 7) విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్‌ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్‌ (Gross) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి. కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 
    జూన్ 10 , 2024
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    నటీనటులు: కాజల్‌,  నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల సంగీతం: శ్రీచరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌ నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి విడుదల: 07-06-2024 ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie Review). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? పోలీసు ఆఫీసర్‌గా కాజల్‌ ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో అదరగొట్టింది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఇక భర్తగా నవీన్‌ చంద్ర పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించలేదు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించారు. సత్యభామ క్యారెక్టరైజేషన్‌ను బలంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆధారాల్ని చేజేతులా వదిలేస్తూ.. మళ్లీ వాటి కోసమే అన్వేషించడం కాస్త మైనస్‌గా మారింది. ఇంకాస్త బెటర్‌గా స్క్రీన్‌ప్లేను నడిపించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. అయితే సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఒకే. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను, ఉత్కంఠ సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కాజల్‌ నటనకొన్ని ట్విస్టులుపతాక సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్క్రీన్‌ప్లేసెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-interesting-facts-about-kajal-aggarwal.html
    జూన్ 07 , 2024
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.  ఇస్మార్ట్ శంకర్ తర్వాత  వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.  అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.  ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.  మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.  టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.  సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.  బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం  థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా:  మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
    Samantha: నాగ చైతన్య ఫ్యాన్స్‌కి చిన్మయి వార్నింగ్..? సమంతను ఏమైనా అన్నారంటే..!
    సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ‘మ్యూజికల్ కాన్సర్ట్’ (Musical Concert) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 పాటలు హిట్టయ్యాయి. దీంతో మ్యూజికల్ కాన్సర్ట్‌ని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, సింగర్స్ సిద్ శ్రీరామ్, చిన్మయి, తదితరులు స్టేజిపై సందడి చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల్లోని పాటలు పాడుతూ హోరెత్తించారు. అయితే, మ్యూజిక్ సెషన్ అనంతరం చిన్మయి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా నాగచైతన్య ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చిందని చర్చ సాగుతోంది.  https://twitter.com/SureshPRO_/status/1691450193684934656 సమంత అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది సినిమాల్లోని ఆమె గాత్రమే. సామ్‌కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే. సమంత తొలి సినిమా నుంచి వీరిద్దరి కాంబో కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా ఖుషి సినిమాకు సైతం సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో చిన్మయి, రాహుల్ దంపతులు అండగా నిలిచారు. కుంగిపోవద్దని ధైర్యం నూరి పోశారు.  https://twitter.com/SamanthaPrabuFC/status/1691498121405374464 అంతకుముందు నాగచైతన్యతో విడాకుల ఘటనపై సామ్ మీద చై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోశారు. సమంత ప్రవర్తనే కారణమంటూ నిందించారు. దీంతో సామ్ కుంగుబాటుకి గురైంది. సన్నిహితుల సాయంతో క్రమంగా కోలుకుంటూ సామ్ తిరిగి మేకప్ వేసుకుంది. అయితే, ఈ తతంగం అందరూ మర్చిపోయిన సమయంలో చిన్మయి చేసిన కామెంట్స్ నాటి రోజుల్ని గుర్తు చేశాయి.  https://twitter.com/TeamSamantha__/status/1691659796737622037 చిన్మయి ఏమందంటే? స్టేజిపై పాట పాడిన అనంతరం యాంకర్ సుమ చిన్మయికి మైక్ ఇచ్చింది. ‘ఈ స్టేజిపై నుంచి నేనొక విషయం చెప్పాలని అనుకుంటున్నా సామ్.. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది నీ వల్లే. ఈ రోజు నువ్వు ఎంతో మందిలో స్ఫూర్తి నింపావు. అమ్మాయిలకు, అబ్బాయిలకు నువ్వొక హీరోవి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఉత్తమమైన వ్యక్తి సమంత. చాలా మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏమీ మారదు’ అంటూ మాట్లాడింది. అనంతరం, సమంతకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడింది. నాగచైతన్యతో విడాకులపై సమంతను బలిపశువును చేయడంపై చిన్మయి ఇలా స్ట్రాంగ్ రిప్లే ఇచ్చినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.  https://twitter.com/SamanthaPrabuFC/status/1691489745350897664 ఫ్యాన్స్ హ్యాపీ చిన్మయి స్పీచ్‌పై సమంత ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు సరైన విషయం చెప్పారంటూ చిన్మయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత గురించి ఫ్యాన్స్ మనసులోని మాటను చిన్మయి బయటపెట్టారని చెబుతున్నారు. సామ్, చిన్మయిల ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మరికొందరు ఫ్యాన్స్ సైతం ఇదే విధమైన ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తరఫున మాట్లాడినందుకు చిన్మయికి ధన్యవాదాలు చెబుతున్నారు. https://twitter.com/__GirDhar/status/1691518743820791809 విజయ్, సామ్ పర్ఫార్మెన్స్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఖుషి టైటిల్ సాంగ్‌కి వీరిద్దరూ కలిసి కాలు కదిపారు. సామ్‌ని విజయ్ ఒంటిచేత్తో ఎత్తుకుని గింగిరాలు తిప్పాడు. అలాగే పైకి ఎత్తుకుని ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాడు. కిందికి దిగగానే సామ్ ‘హల్లో హైదరాబాద్’ అని విష్ చేయగా ‘తెలుగు ప్రజల్లారా..’ అంటూ రౌడీబాయ్ స్టార్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  https://twitter.com/AndhraBoxOffice/status/1691475831133274112
    ఆగస్టు 16 , 2023
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  కథేంటి కపిలేశ్వరపురం అనే ప‌ల్లెటూరులో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి ‘అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో’ న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే చైత‌న్య‌రావ్  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా బాగుంది. చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది.  కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు ఎలా సాగిందంటే క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  డైరెక్షన్‌ & టెక్నికల్‌గా 1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా.. క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ 1980 నాటి నేపథ్యంనటీనటులుకథలో మలుపులు మైనస్‌ పాయింట్స్‌ ఎడిటింగ్‌పాత పంథాలో సన్నివేశాలు రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=COPhzQh-wc8
    జూలై 21 , 2023
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్‌ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్‌, శర్వానంద్‌ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్‌ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  మనమే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్‌ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్‌ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ నటుడు శర్వానంద్‌.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  సత్యభామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్‌ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్‌ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్‌ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాజ‌ల్‌ నటనపై ప్రశంసలు కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
    జూన్ 08 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు నందమూరి బాలకృష్ణ ఎవరు? బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం. నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత? 5 అడుగుల 9  అంగుళాలు నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు? చెన్నై నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు? 1960 జూన్ 10  నందమూరి బాలకృష్ణ భార్య పేరు? వసుంధర దేవి బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి? ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?  ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని) నందమూరి బాలకృష్ణ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్ NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు? తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ బాలకృష్ణ అభిమాన నటుడు? నందమూరి తారక రామారావు బాలకృష్ణ అభిమాన హీరోయిన్? సావిత్రి బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు? మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ. బాలకృష్ణకు ఇష్టమైన కలర్? వైట్ బాలకృష్ణ ఏం చదివాడు? నిజాం కాలేజీలో డిగ్రీ బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 108 సినిమాల్లో నటించాడు బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం? చికెన్ పలావు బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా పేరు? గౌతమిపుత్ర శాతకర్ణి https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం? హిందూపురం బాలయ్య గెలుచుకున్న అవార్డులు? బాలయ్య  3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
    మార్చి 19 , 2024
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.  యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.  https://twitter.com/i/status/1772544977396220385 బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్‌ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) స్టార్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.  హాట్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.  View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.  యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.  యంగ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.  View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) నటి మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.  నటి రాయ్‌ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.  ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.  హోలీని బాగా సెలబ్రేట్‌ చేసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శివాలిక ఒబెరాయ్‌ ఉంది.  యంగ్‌ హీరోయిన్‌ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.  మెగా డాటర్స్‌ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  బాలీవుడ్‌ భామ అవనీత్‌ కౌర్‌.. హోలీ రోజున సోషల్‌ మీడియాలో తళుక్కుమంది.  ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్‌.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.  పాపులర్‌ హీరోయిన్‌ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్‌ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.  హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.  View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
    మార్చి 26 , 2024
    War 2: బాలీవుడ్‌ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్‌ రెమ్యూనరేషన్‌.. ‘వార్‌ 2’ తర్వాత ఎన్టీఆర్‌ సోలో చిత్రం!
    War 2: బాలీవుడ్‌ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్‌ రెమ్యూనరేషన్‌.. ‘వార్‌ 2’ తర్వాత ఎన్టీఆర్‌ సోలో చిత్రం!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) చిత్రంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) క్రేజ్‌ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం తారక్‌ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న 'దేవర' (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్‌లో చేయబోతున్న 'వార్‌ 2' (War 2) చిత్రం. ముఖ్యంగా 'వార్‌ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో  ఈ సినిమా నేషనల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  60 రోజుల్లో షూటింగ్‌ పూర్తి! 'వార్‌ 2' చిత్రంలో తారక్‌, హృతిక్‌ రోషన్‌ పాత్రల షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్‌ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న 'వార్‌ 2' చిత్ర షూటింగ్‌ను ఎక్కువ భాగం స్టూడియోస్‌లోనే తీయనున్నారట. హృతిక్‌ పార్ట్‌ను జూన్‌ కల్లా, తారక్‌ పార్ట్‌ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.  ‘రా ఏజెంట్‌’గా ఎన్టీఆర్‌! యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న 'వార్‌ 2' చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్‌ ఇండియన్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తారక్‌ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్‌ 2’ టీమ్‌, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తారక్‌ రెమ్యూనరేషన్‌ అన్ని కోట్లా? 'వార్‌ 2' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్‌ రెమ్యూనరేషన్‌ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్‌ రోల్‌ కోసం తారక్‌ ఈ రేంజ్‌లో ఛార్జ్‌ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 'వార్‌ 2' కోసం సరికొత్త టెక్నాలజీ! 'వార్‌ 2' సినిమా కోసం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్‌ డోర్‌లో వచ్చే ఎన్టీఆర్‌, తారక్‌ కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను పూర్తిగా బాడీ డబుల్స్‌తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్‌, హృతిక్‌ ముఖాలను స్వాప్‌ చేస్తారట. గ్రాఫిక్స్‌ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్‌ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్‌ చెబుతోంది. 
    మార్చి 13 , 2024
    Mokshagna Teja: మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై బిగ్‌ అప్‌డేట్‌.. ఖుషీ అవుతున్న నందమూరి ఫ్యాన్స్‌!
    Mokshagna Teja: మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై బిగ్‌ అప్‌డేట్‌.. ఖుషీ అవుతున్న నందమూరి ఫ్యాన్స్‌!
    టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ కుటుంబంలో నందమూరి వంశం ఒకటి. నందమూరి తారక రామారావు నట వారసులుగా వచ్చిన హరికృష్ణ (Hari Krishna), బాలకృష్ణ (Bala Krishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కళ్యాణ్‌రామ్‌ (Kalyan Ram) వంటి వారు ఇండస్ట్రీలో తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.  కథలు వింటున్న బాలయ్య! ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రారంభం కావాలని తండ్రి నందమూరి బాలకృష్ణ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడి ఫిల్మ్‌ కోసం కథలు వింటున్నట్లు సమాచారం. ఏ కథ అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి బాగుంటుందోనన్న దానిపై ఇప్పటికే బాలయ్య పూర్తి స్పష్టతతో ఉన్నారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకు తగ్గ కథ దొరకగానే బాలయ్య వెంటనే ఓకే చెప్పేస్తారని టాక్‌ వినిపిస్తోంది.  ఫిజిక్‌పై ఫోకస్‌ పెట్టిన మోక్షజ్ఞ! తొలి చిత్రాన్ని ఎలాగైన సెట్స్‌పైకి తీసుకెళ్లాలని తండ్రి బాలకృష్ణ కృషి చేస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ తన ఫిజిక్‌పై దృష్టి పెట్టారు. తొలి సినిమా కోసం అతడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడట. ఈ క్రమంలో రీసెంట్‌గా వైరల్ అయిన పిక్‌లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్‌గా మారిపోయి కనిపించాడు. గత ఏడాది వరకూ బొద్దుగా ఉన్న అతను ప్రస్తుతం బరువు తగ్గి ఫిట్‌గా హీరో లుక్‌లోకి వచ్చేశాడు. పైగా ప్రస్తుతం వైజాగ్‌లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ‘ఆదిత్య 369’ సీక్వెల్! మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. బాలకృష్ణ సూపర్‌ హిట్‌ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌లో మోక్షజ్ఞ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారని కూడా టాక్‌ వినిపిస్తోంది. మరి చివరకు ఏ దర్శకుడు ఫిక్స్ అవుతాడో చూడాలి. ఇదే నిజమైతే తమ ఆనందానికి అవధులు ఉండవని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. తన తండ్రి చేసిన ‘ఆదిత్య 369’ సినిమాతో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే విజయం తథ్యమని అభిప్రాయపడుతున్నారు. బోయపాటితో ఉంటుందా? మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై గోవా ఫిలిం ఫెస్టివల్‌ వేదికగా నందమూరి బాలకృష్ణ అప్పట్లోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని ఈ ఏడాది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మోక్షజ్ఞ చిత్రాన్ని బోయపాటి చేస్తారా? అన్న ప్రశ్నకు ‘అంతా ధైవేచ్ఛ’ అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ సినిమా త్వరలోనే ఉండనుంది.
    మార్చి 04 , 2024
    Nandini Rai: ఎద పొంగులతో రెచ్చిపోయిన నందిని రాయ్‌.. ఈమె చాలా హాట్‌ గురూ!
    Nandini Rai: ఎద పొంగులతో రెచ్చిపోయిన నందిని రాయ్‌.. ఈమె చాలా హాట్‌ గురూ!
    ప్రముఖ నటి నందిని రాయ్ తన హాట్‌ అందాలతో మరోమారు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. బ్లాక్‌ డ్రెస్‌ బ్రాలో ఎద పొంగులను ఆరబోసి రచ్చ రచ్చ చేసింది.  ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ హాట్‌ ఫొటోలను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.  హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందిని రాయ్‌ ఇండస్ట్రీలోకి రాక ముందు మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకుంది.  2010లో మిస్‌ ఆంధ్రాగా ఎంపికైన ఈ భామ.. ఆ తర్వాత 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసింది.  2011లో ‘ఫ్యామిలీ ప్యాక్‌’ అనే హిందీ చిత్రం ద్వారా నందిని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘మాయ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తెలుగు షోలో నందిని రాయ్ పాల్గొంది. తన అందం, అభినయం, గ్లామర్‌తో ఆ సీజన్‌లో వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన నందినికి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌ వరుస అవకాశాలు అందేలా చేశాయి. దీంతో ఆమె ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్‌’, ‘శివరంజనీ’, ‘కోతి కొమ్మచ్చి’ చిత్రాల్లో నటించింది.  ఈ ఏడాది విడుదలైన వారసుడు, భాగ్‌సాలే, సీఎస్‌ఐ సనాతన్ మూవీల్లోనూ నందిని రాయ్‌ మెరిసింది. అలాగే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ ఆమె అదరగొట్టింది. ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సోషల్‌ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటో షూట్‌లను నిర్వహిస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.  ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5.3 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె ఏ హాట్‌ ఫొటోను పోస్టు చేసినా వారు విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. 
    నవంబర్ 15 , 2023
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్‌ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ తనయుడు అకిరా నందన్‌ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్‌ వీడియోను క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.  నాన్నకు ప్రేమతో.. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్‌ చేసిన వీడియోను పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ (Renu Desai) దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్‌ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.  View this post on Instagram A post shared by renu desai (@renuudesai) పవన్‌ పంచ్‌ డైలాగ్స్‌.. అకిరా ఎడిట్‌ చేసిన వీడియోలో పవన్‌ సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak) వరకు పవన్‌ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.  https://twitter.com/i/status/1798036906124657133 తండ్రితోనే అకిరా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్‌ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్‌ రెండో భార్య కుమారుడు అకిరా నందన్‌ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.  https://twitter.com/i/status/1797940145787908224 https://twitter.com/i/status/1798002911848673587 అకిరా ఎంతో టాలెంటెడ్‌! అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్‌ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్‌ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.  https://twitter.com/i/status/1747251367033577947
    జూన్ 06 , 2024
    REVIEW: కృష్ణ వంశీ మార్క్‌ భావోద్వేగాలతో నిండిన 'రంగమార్తాండ'
    REVIEW: కృష్ణ వంశీ మార్క్‌ భావోద్వేగాలతో నిండిన 'రంగమార్తాండ'
    కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కృష్ణ వంశీ. కొద్దిరోజులుగా హిట్ చిత్రాలు తీయకపోయినా తన మార్క్‌ ఎవ్వరూ మర్చిపోలేదు. వంశీ ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కించాడు. ఉగాది రోజున సినిమా విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్‌ షోలు వేశారు. మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కృష్ణ వంశీ సక్సెస్ బాట పట్టాడా? అనేది చూద్దాం. దర్శకుడు: కృష్ణవంశీ  నటీ నటులు: ప్రకాశ్ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, తదితరులు సంగీతం: ఇళయ రాజా సినిమాటోగ్రఫీ: రాజ్‌.కె. నళ్లీ కథేంటీ? రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్‌). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ.  ఎలా ఉందంటే? రాఘవరావు, చక్రవర్తి పాత్రలతో కథను ఆరంభించిన దర్శకుడు రంగమార్తాండ బిరుదు తీసుకొని నాటకాలకు స్వస్థి పలికిన వ్యక్తి పాత్రలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. కోడలికి ఆస్తి పంచి, కుమార్తెకు ప్రేమించిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసి తన బాధ్యతలు నిర్వర్తించిన పెద్దమనిషి సాధారణమైన జీవితాన్ని చూపించాడు.  ఆనందంగా గడుపుదామనుకున్న వ్యక్తికి కోడలు పెట్టే అవమానాలు, కూతురు ఇంటికి వెళ్లిన అతడికి ఎదురయ్యే పరిణామాలు దిక్కుతోచని స్థితిలో పడేస్తాయి.కుటుంబ విలువలను చక్కగా చూపించే కృష్ణవంశీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చూపించాడు.  మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్చాడు వంశీ. తెలుగు నాటకరంగం ఎంత గొప్పదో వివరించే సన్నివేశాలు అదిరిపోతాయి.  ఎవరెలా చేశారంటే? నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాతో శిఖరాన్ని చేరుకున్నాడు. రాఘవపాత్రకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరంటే అతిశయోక్తి కాదు.  పంచతంత్రం సినిమాతో రూటు మార్చిన బ్రహ్మానందం భావోద్వేగపూరితమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఆయనలో సరికొత్త కోణం కనిపిస్తుంది. భర్త చాటు భార్యగా కేవలం కళ్లతోనే హావాభావాలు పలికించే పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది.  రాఘవరావు కోడలి పాత్రలో అనసూయ, కుమార్తెగా శివాత్మిక, మిగిలిన పాత్రల్లో నటించిన రాహుల్ సిప్లిగంజ్, అలీ రాజా, ఆదర్శ్ వారి రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ తరం యువత ఎలా ఉంటారనే కోణంలో మెప్పించారు. సాంకేతికత విలువలు రంగమార్తాండ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో తన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుత యువత, తల్లిదండ్రుల మధ్య సంఘర్షణను చూపించండంలో విజయం సాధించాడు .  సినిమాకు మరో పిల్లర్ సంగీతం. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన వినసొంపైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది.  ఇక్కడ మరోవ్యక్తి గురించి చెప్పుకోవాల్సిందే. ఆకెళ్ళ శివ ప్రసాద్ మాటలు సినిమాకు ప్రధాన బలం. సినిమాలపై అతడికి ఉన్న అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది.  బలాలు నటీనటులు దర్శకత్వం సంగీతం మాటలు బలహీనతలు తారాబలం లేకపోవటం రేటింగ్: 3.5/5
    మార్చి 21 , 2023
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు  జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.  ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.  ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.  ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.  ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.  హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.  తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌  ఫేవరేట్‌ సాంగ్‌ & సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.  రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.  రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి. 
    మే 20 , 2024

    @2021 KTree