• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • War 2: బాలీవుడ్‌ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్‌ రెమ్యూనరేషన్‌.. ‘వార్‌ 2’ తర్వాత ఎన్టీఆర్‌ సోలో చిత్రం!

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) క్రేజ్‌ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం తారక్‌ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న ‘దేవర’ (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్‌లో చేయబోతున్న ‘వార్‌ 2’ (War 2) చిత్రం. ముఖ్యంగా ‘వార్‌ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో  ఈ సినిమా నేషనల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    60 రోజుల్లో షూటింగ్‌ పూర్తి!

    ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌, హృతిక్‌ రోషన్‌ పాత్రల షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్‌ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న ‘వార్‌ 2’ చిత్ర షూటింగ్‌ను ఎక్కువ భాగం స్టూడియోస్‌లోనే తీయనున్నారట. హృతిక్‌ పార్ట్‌ను జూన్‌ కల్లా, తారక్‌ పార్ట్‌ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం. 

    రా ఏజెంట్‌’గా ఎన్టీఆర్‌!

    యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్‌ 2’ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్‌ ఇండియన్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తారక్‌ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్‌ 2’ టీమ్‌, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    తారక్‌ రెమ్యూనరేషన్‌ అన్ని కోట్లా?

    ‘వార్‌ 2’ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్‌ రెమ్యూనరేషన్‌ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్‌ రోల్‌ కోసం తారక్‌ ఈ రేంజ్‌లో ఛార్జ్‌ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    ‘వార్‌ 2’ కోసం సరికొత్త టెక్నాలజీ!

    ‘వార్‌ 2’ సినిమా కోసం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్‌ డోర్‌లో వచ్చే ఎన్టీఆర్‌, తారక్‌ కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను పూర్తిగా బాడీ డబుల్స్‌తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్‌, హృతిక్‌ ముఖాలను స్వాప్‌ చేస్తారట. గ్రాఫిక్స్‌ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్‌ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్‌ చెబుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv