• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వీకెండ్‌లో చూడాల్సిన కొత్త చిత్రాలు ఇవే!

    గతంలో వీకెండ్ అనగానే అందరి దృష్టి థియేటర్ల వైపునకు వెళ్లేది. అయితే ఓటీటీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంచక్కా ఫ్యామిలీతో ఇంట్లోనే కొత్త సినిమాలను చూసే అవకాశం ఓటీటీ కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఫ్యామిలీతో వీకెండ్‌ను ఎంజాయ్‌ చేసేయండి.

    విద్య వాసుల అహం (Vidya Vasula Aham)

    రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘విద్యా వాసుల అహం‘ (Vidya Vasula Aham). మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. పెళ్లైన జంటల మధ్య అహంతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా మే 17న ఆహాలో విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

    షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai!)

    చైతన్యరావు, భూమి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి!‘. కుమారస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఆహా వేదికగా మే 18 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. సినిమా కథ విషయానికి వస్తే.. ‘చిరంజీవి, విజయ మధ్య తరగతి భార్య భర్తలు. చైన్‌ సిస్టమ్‌ బిజినెస్‌ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంతకీ ఆ బోగస్‌ కంపెనీ ఎవరిది? తన డబ్బులు పోయాయని తెలిసిన చిరంజీవి ఏం చేశాడు? ఈ మోసానికి కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధం ఏంటి?’ అన్నది ప్లాట్‌.

    మాయ పేటిక (Maya Petika)

    పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్ కౌర్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ‘మాయా పేటిక‘ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రమేశ్‌ రాపార్తి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ‘ఈటీవీ విన్‌’లో మే 16 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. మానవ జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. గతేడాది థియేటర్లలో ఈ చిత్రం విడుదలై యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఫోన్‌ పొగొట్టుకుంటుంది. ఆమెకు నిర్మాత ఓ మొబైల్ గిఫ్టుగా ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల కాబోయే భర్తతో గొడవలు వస్తాయి. అందుకని, అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి ఫోన్ పలువురి చేతులు మారి పాకిస్థాన్‌లోని టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్తుంది. అసలు ఈ ఫోన్ వల్ల పాయల్‌కు ఎలాంటి కష్టాలు వచ్చాయి? మొబైల్ ఫోన్ టెర్రరిస్టుల చేతిలోకి ఎలా వెళ్లింది అనేది కథ.

    చోరుడు (Chorudu)

    జి.వి ప్రకాష్‌, ఇవానా జంటగా నటించిన తమిళ డబ్బింగ్‌ చిత్రం ‘చోరుడు‘. పి.వి. శంకర్‌ దర్శకత్వం వహించాడు. మే 14 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో చోరుడు చేసేయచ్చు. సినిమా కథ విషయానికి వస్తే.. ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.

    ఆవేశం (Aavesham)

    పుష్ప’ ఫేమ్‌ ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో చేసిన మలయాళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆవేశం‘. ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మే 9న అమెజాన్‌ వేదికగా మలయాళ వెర్షన్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే మే 17నుంచి ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్‌లోనూ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ‘కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్‌ గుండా రంగా (ఫహద్‌ ఫాసిల్‌)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు?’ అన్నది కథ.

    గాడ్జిల్లా x కాంగ్‌ : ది న్యూ ఆంపైర్‌ (Godzilla x Kong: The New Empire)

    హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘గాడ్జిల్లా X కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌‘ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో మే 14 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే రెంటల్‌ విధానంలో ఈ మూవీని చూడాల్సి ఉంటుంది. అటు యూట్యూబ్‌లోనూ ఇదే విధానంలో సినిమాను తీసుకొచ్చారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషులను అంతం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో నోవా అనే యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌.. నోవా, చింపాజీతో ఎలాంటి పోరాటం చేసింది? ప్రాక్సిమస్‌ను వారు కలిసికట్టుగా ఎలా ఎదుర్కొన్నారు?’ అన్నది కథ.


    అక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (Aquaman and the Lost Kingdom)

    జేమ్స్‌ వాన్ దర్శకత్వంలో జాసన్‌ మోమోవా, పార్టిక్‌ విల్సన్‌, అంబర్‌ హర్డ్‌ ప్రధాన పాత్రలు పోషించిన అడ్వెంచరస్‌ చిత్రం ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్‘. మే 21 నుంచి జియో ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని ఫ్రీగా వీక్షించవచ్చు. ‘ఆర్థర్‌ కర్రీ (జాసన్‌ మోమోయ్‌).. సోదరుడు ఓరమ్‌ను ఓడించి ట్రైడెంట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అట్లాంటిస్‌ రాజు అవుతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సముద్రపు దొంగ డేవిడ్‌ బయలుదేరుతాడు. ఓ గుహలోకి వెళ్లిన అతడికి అద్భుతమైన శక్తులు ఉన్న బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరుకుతుంది. దాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత డేవిడ్‌ ఎలా మారాడు? అతడికి లభించిన శక్తులు ఏమిటి? డేవిడ్ దుశ్చర్యలను ఆర్థర్‌ ఎలా ఎదుర్కొన్నాడు?’ అన్నది కథ.

    బస్తర్: ది నక్సల్ స్టోరీ (Bastar: The Naxal Story)

    ప్రముఖ నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. ఇందులో ఆదా శర్మ పోలీసాఫీసర్‌ పాత్ర చేసింది. మే 17 నుంచి జీ 5లో ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. హిందీలో దీనిని వీక్షించవచ్చు. పలు దక్షిణాది భాషల్లోనూ ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘బస్తర్‌ ప్రాంతంలోని పౌరులను మావోయిస్టులు హింసిస్తుంటారు. అటు మందుపాతర పేల్చి 76 మంది జవాన్లను పొట్టన పెట్టుకుంటారు. వారిని అంతం చేసేందుకు ఐపీఎస్‌ అధికారిణి నీరజా (అదా శర్మ) రంగంలోకి దిగుతుంది. ఆమె ఎలాంటి చర్యలకు దిగింది? ఈ క్రమంలో నీరజాకు ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది కథ.

    బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (Baahubali: Crown of Blood)

    భారత సినిమా స్థాయిని పెంచిన బాహుబలి తాజాగా యానిమేటెడ్‌ సిరీస్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 17 నుంచి డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌కు పనిచేసిన గ్రాఫిక్‌ ఇండియా సంస్థతో కలిసి మేకర్స్ దీన్ని రూపొందించారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv