• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Good Telugu Movies On Zee5: ‘జీ 5’లో గత పదేళ్లలో వచ్చిన తెలుగు బెస్ట్‌ చిత్రాలు ఇవే!

  ఓటీటీ రాకతో తెలుగు చిత్రాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్‌ బాగుంటే ఏ సినిమానైనా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5).. తెలుగులో మంచి కంటెంట్‌తో రూపొందిన చిత్రాలను స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తోంది. ఇలా గత పదేళ్లలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తన ఓటీటీ వేదికపైకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

  Contents

  హనుమాన్‌ (HanuMan)

  సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. (Best Telugu Movies on Zee5 2024)

  గామి (Gaami)

  అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో (Telugu Movies On Zee5) శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.

  రజాకార్‌ (Razakar)

  హైదరాబాద్‌ సంస్థానాన్ని(Zee5 Top Telugu Movies)  తుర్కిస్తాన్‌గా మార్చాలని నైజాం ప్రభువు నిర్ణయించుకుంటాడు. రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకొని బలవంతపు మత మార్పిడిలకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ప్రజలను రజాకార్లు దారుణంగా హింసిస్తారు. దీంతో వారికి వ్యతిరేకంగా ప్రజలు ఎలాంటి పోరాటం చేశారు? కేంద్ర హోంమంత్రి పటేల్ సమస్యను ఎలా పరిష్కరించారు? అన్నది కథ.

  కాటేరా (Kaatera)

  భూస్వామిని (Best Telugu Movies On Zee5) చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.

  ప్రేమ విమానం (Prema Vimanam)

  పల్లేటూరు నేపథ్యంగా సాగే కథ ఇది. రాము( దేవాన్ష్ నామా), లచ్చి(అనిరుధ్ నామా) ఇద్దరు చిన్నపిల్లలు. వీరికి విమానం ఎక్కాలనేది కోరిక. కానీ వారి పేదరికం వల్ల అది కుదరదు. అప్పుల బాధతో తండ్రి చనిపోగా వారిని తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) పోషిస్తుంది. ఇదే ఊరిలో మణి( సంగీత్ శోభన్) సర్పంచ్ కూతురు అభిత ప్రేమించుకుంటారు. అభితకు పెళ్లి కుదరడంతో దుబాయ్‌కి పారిపోవాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ రామ్, లచ్చిలను చూసి షాకవుతారు. అసలు రామ్‌, లచ్చి ఏయిర్‌పోర్టుకు ఎందుకు వచ్చారు. మణి, అభిత పెళ్లి చేసుకున్నారా? అన్నది మిగతా కథ

  విమానం (Vimanam)

  ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలనే ఆశ ఉంటుంది. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. ఇంతకు వీరయ్య తన కొడుకు చివరి కోరిక తీర్చాడా? అనేది మిగిలిన కథ.

  ది కేరళ స్టోరీ (The Kerala Story)

  కేరళలోని (Zee5 Top Telugu Movies) ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్‌ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్‌ వాష్‌ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ.

  రైటర్‌ పద్మభూషణ్‌ (Writer Padma Bhushan)

  పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ

  కార్తికేయ 2 (Karthikeya 2)

  కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.

  బింబిసార (Bimbisara)

  త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌) క్రూరత్వానికి ప్రతీక. అలాంటి బింబిసారుడు మాయా దర్పణం వల్ల క్రీ.పూ 500 ఏళ్ల నాటి నుంచి ప్రస్తుత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. వర్తమానంలో బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.

  విక్రమ్‌ (Vikram)

  డ్రగ్ మాఫియా (Zee5 Top Telugu Movies) కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.

  ఆర్ఆర్ఆర్‌ (RRR)

  నిజాం రాజు (Best Telugu Movies On Zee5) ను కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

  వరుడు కావలెను (Varudu Kavalenu)

  భూమి (రీతు వర్మ) చాలా పర్టిక్యులర్‌గా ఉండే అమ్మాయి. ఆమె వర్క్‌ చేసే కంపెనీలోకి ఆకాష్‌ (నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఆ ఇద్దరికీ ఎలా రిలేషన్‌ కుదిరింది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్‌ను ఇష్టపడుతుందా? లేదా? అన్నది కథ.

  రిపబ్లిక్‌ (Republic)

  అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది కథ.

  రాజ రాజ చోర (Raja Raja Chora)

  భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.

  అరణ్య (Aranya)

  అరణ్య (రానా) అడవి ప్రేమికుడు. అతడు ఏనుగుల బతుకు కోసం ఎలాంటి పోరాటం చేశాడు. అసలు ఏనుగులకు వచ్చిన సమస్య ఏంటి? వాటిని అరణ్య ఎలా పరిష్కరించాడు? అన్నది కథ.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా (30 Rojullo Preminchadam Ela)

  అర్జున్‌ (ప్రదీప్‌ మాచిరాజు), అక్షర (అమృతా అయ్యర్‌) ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌. వీరికి ఒకరంటే ఒకరికీ పడదు. ఫ్రెండ్స్‌తో విహారయాత్రకు వెళ్లినప్పుడు వీరికి పెద్ద సమస్య ఎదురవుతుంది? ఇంతకీ ఆ సమస్య ఏంటి? వీరు ఎందుకు 30రోజుల్లో ప్రేమించుకోవాల్సి వచ్చింది? అన్నది కథ.

  క్రాక్‌ (Krack)

  హీరో నిక్కచ్చిగా ఉండే పోలీసాఫీసర్‌ (Best Telugu Movies On Zee5). సీఐగా ఒంగోలుకి వెళ్లాక అక్కడ ముఠా నాయకుడు కఠారి కృష్ణ(సముద్రఖని)తో వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్యతో కఠారీ కృష్ణకు సంబంధం ఏంటి? ఈ కేసును వీరశంకర్‌ (రవితేజ) ఎలా ఛేదించాడు? అన్నది కథ.

  జుమాంజీ: వెల్‌కమ్ టు ది జంగిల్ (Jumanji: Welcome to the Jungle)

  నలుగురు హైస్కూల్ విద్యార్థులు పాత వీడియో గేమ్ కన్సోల్‌ను కనిపెడుతారు. తమ వేషాలు మార్చుకుని ఆ గేమ్ జంగిల్ ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అన్నది కథ.

  రాక్షసుడు (Rakshasudu)

  అరుణ్ కొత్తగా డ్యూటీలో చేరిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్. ఆ సమయంలో పెద్ద ఎత్తున అమ్మాయిలు మిస్సింగ్ అవుతూ శవాలుగా బయటపడుతుంటారు. ఈ కేసును అరుణ్ చేపట్టడంతో అతని కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇంతకు ఈ కేసును అరుణ్ ఎలా ఛేదించాడు అనేది కథ.

  ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar)

  ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్‌ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

  జెర్సీ (Jersey)

  ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ

  టాక్సీవాలా (Taxiwala)

  శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

  అరవింద సమేతా (Aravinda Sametha)

  రెండు ఊర్ల మధ్య 30 ఏళ్లుగా వైరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో శత్రువులు రాఘవ రెడ్డి (ఎన్టీఆర్‌) నాన్న (నాగబాబు)ను చంపేస్తారు. భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని రాఘవ నిర్ణయించుకుంటాడు. గొడవలను చల్లార్చే క్రమంలో హీరోకు ఎదురైన సమస్యలేంటి? అన్నది కథ.

  వెనం (Venom)

  లైఫ్ ఫౌండేషన్ CEO కార్ల్‌టన్‌ను తొలగించడానికి… ఎడ్డీ అనే ఒక జర్నలిస్ట్, మానవ పరీక్షలపై పరిశోధన చేపడుతాడు. ఈక్రమంలో అతని తెలియకుండానే, అతనిలో ప్రాణాంతక సామర్థ్యాలున్న ఒక గ్రహాంతర వాసి సహజీవన చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

  దేవదాస్‌ (Devadas)

  దేవ (నాగార్జున) పెద్ద డాన్‌. ఓ రోజు బుల్లెట్‌ గాయంతో దాస్‌ (నాని) క్లినిక్‌కు వస్తాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాస్‌తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తనని చంపాలని చూస్తున్న డేవిడ్‌ను దేవ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

  గీతా గోవిందం (Geetha Govindam)

  గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.

  టిక్‌ టిక్‌ టిక్‌ (Tik Tik Tik)

  గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.

  నా పేరు సూర్య (Na Peru Surya)

  సూర్య (అల్లు అర్జున్‌) కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని సైనికుడు. దీని వల్ల ఆర్మీ నుంచి సస్పెండ్‌ అవుతాడు. మానసికంగా ఫిట్‌ అనే సర్టిఫికేట్‌తో వస్తేనే తిరిగి సైన్యంలో చేర్చుకుంటామని అధికారులు కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌కు వచ్చిన హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సైకాలజిస్ట్‌ అర్జున్‌తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.

  ఛల్‌ మోహన రంగ (Chal Mohana Ranga)

  మోహన్‌ రంగ (నితిన్‌) జాబ్‌ కోసం అమెరికాకు వెళ్తాడు. అక్కడ మేఘను ఇష్టపడతాడు. ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావడంతో ప్రేమ వ్యక్తం చేసుకోకుండానే విడిపోతారు. వారు తిరిగి ఎలా కలిశారు? రంగ తన ప్రేమను చెప్పాడా లేదా? అన్నది కథ.

  ఉన్నది ఒకటే జిందగీ (Unnadi Okate Zindagi)

  అభి, వాసు (Popular Telugu Movies In Zee 5) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కానీ వారిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్ల వారి స్నేహబంధం పరీక్షకు గురవుతుంది.

  బాబు బంగారం (Babu Bangaram)

  హీరో మంచి మనసు కలిగిన పోలీసు ఆఫీసర్‌ (Best Telugu Movies On Zee5). కష్టాల్లో ఉన్న హీరోయిన్‌ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి అన్నది కథ.

  అఆ (A Aa)

  హీరో హీరోయిన్‌ బావ మరదళ్లు. అయితే వారి కుటుంబాల మధ్య ఓ విషయమై మనస్ఫర్థలు తలెత్తుతాయి. అనుకోకుండా హీరో ఇంటికి వచ్చిన హీరోయిన్‌ అతడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా లేదా? చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.

  సుప్రీమ్‌ (Supreme)

  ట్యాక్సీ డ్రైవర్‌ అయిన హీరోకి ఓ రోజు కష్టాల్లో ఉన్న చిన్న పిల్లవాడు పరిచయం అవుతాడు. కోటీశ్వరుడైన ఆ బాలుడ్ని చంపేందుకు విలన్లు యత్నిస్తుంటారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? విలన్లకు బాలుడికి సంబంధం ఏంటి? బాలుడ్ని రక్షించడం కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.

  సైజ్‌ జీరో (Size Zero)

  స్వీటీ అనే మహిళ (Popular Telugu Movies In Zee 5) స్థూలకాయంతో బాధపడుతుంటుంది. దీంతో స్లిమ్మింగ్ సెంటర్‌లో చేరుతుంది. కానీ వారు సూచించే మందుల ప్రభావాలను చూసి భయపడుతుంది. ఆమె స్లిమ్‌గా కాకుండా ఫిట్‌గా ఉండటమే ముఖ్యమనే ప్రచారాన్ని ప్రారంభిస్తుంది.

  కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (Krishnamma Kalipindi Iddarini)

  ఇది బాల్యం నుంచి స్నేహితులైన ఇద్దరి ప్రేమ కథ. సమాజం ఒత్తిడులు, కుటుంబ విబేధాలను దాటుకొని, వారు తమ సంబంధాన్ని బలపరుచుకోవాలని ఆశిస్తారు.

  రాక్షసుడు (తమిళ డబ్బింగ్‌)

  మాస్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్‌ వల్ల అతడికి ఆత్మలు కనిపించడం మెుదలవుతాయి. దయ్యాలకు హెల్చ్‌ చేస్తూ తాను ప్రయోజనం పొందుతూ సాఫీగా జీవితాన్ని గడుపుతుంటాడు మాస్. ఓ రోజు అతడి లైఫ్‌లోకి శివ కుమార్ (సూర్య) ఆత్మ ఎంటర్ అవుతుంది. అసలు ఈ శివ ఎవరు? మాస్‌ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది? అన్నది కథ.

  పండగ చేస్కో (Pandaga Chesko)

  మనీ మైండెడ్ అయిన ఓ యువ వ్యాపారవేత్త తన వ్యాపారం నిమిత్తం ఒక స్త్రీతో పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. తన కుటుంబంలో విభేదాల గురించి తెలుసుకుని, వాటిని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు.

  దోచేయ్‌ (Dochey)

  చందు అనే యువకుడు తన తండ్రిని జైలు నుండి తప్పించి, తన సోదరిని డాక్టర్‌గా మార్చాలని అనుకుంటాడు. అయితే, క్రిమినల్ అయిన మాణిక్యంతో తలపడినప్పుడు అతని కలలు చెదిరిపోతాయి.

  ముకుంద (Mukunda)

  అధికార బలంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న విలన్‌ ఆగడాలకు హీరో చెక్‌ పెట్టాలని అనుకుంటాడు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చికాకు తెప్పిస్తున్న హీరోను అడ్డు తొలగించుకోవాలని విలన్‌ ప్రణాళికలు రచిస్తాడు. ఈ సంగ్రామంలో ఎవరు విజయం సాదించారు? అన్నది కథ.

  పూజా (Pooja)

  వడ్డీ వ్యాపారి అయిన వాసు (Popular Telugu Movies In Zee 5).. శివరామన్ నాయక్ అనే పోలీసును విలన్ల బారి నుంచి రక్షిస్తాడు. దీంతో వాసు విలన్‌ ముఠాకు టార్గెట్‌ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాసు కుటుంబానికి విలన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.

  లౌక్యం (Loukyam)

  హీరో తన ఫ్రెండ్‌ కోసం విలన్‌ చెల్లెల్ని కిడ్నాప్‌ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్‌ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్‌ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

  పవర్‌ (Power)

  పోలీసు ఆఫీసర్‌ కావాలని హీరో (తిరుపతి) కలలు కంటుంటాడు. మరోవైపు అదే పోలికలతో ఉన్న ఏసీపీ బల్‌దేవ్‌ సహాయ్‌ మనుషులు హోం మంత్రి తమ్ముడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అనంతరం అండర్‌గ్రౌండ్‌కు తీసుకెళ్తారు. పోలీసు అధికారి లాగే ఉన్న తిరుపతిని చూసి బలదేవ్‌ సహాయ్‌ స్థానంలోకి హోంమంత్రి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ బల్‌దేవ్‌ సహాయ్‌ ఏమయ్యాడు? అన్నది కథ.

  సికిందర్‌ (Sikandar)

  ముంబైలోని రాజు భాయ్, చంద్రు అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల చుట్టు తిరిగే కథ ఇది. వారు గ్యాంగ్‌స్టర్లుగా ఎందుకు మారారు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.

  శీనుగాడి ప్రేమకథ (Seenu Gadi Prema Katha)

  శీను తండ్రి మాటకు ఎదురు చెప్పడు. లేచిపోయి పెళ్లి చేసుకున్న అక్క దాంపత్యంలోని సమస్యను తీర్చడానికి నగరానికి వస్తాడు. ఎదురింట్లో ఉండే పవిత్రతో ప్రేమలో పడతాడు. లవ్‌ అంటేనే ఇష్టపడని తండ్రిని తమ పెళ్లికి ఎలా ఒప్పించాడు? అన్నది కథ.

  వీరుడొక్కడే (Veerudokkade)

  వినాయగన్‌ (Popular Telugu Movies In Zee 5) అన్యాయం చేసే వారిని అణిచి వేస్తుంటాడు. అయితే ప్రేయసి కోసం హింసా మార్గాన్ని వీడాలని నిర్ణయించుకుంటాడు. కానీ, లవర్‌ కుటుంబానికి ముప్పు ఉన్నట్లు తెలుసుకుంటాడు. అప్పుడు హీరో వారిని ఎలా కాపాడాడు? అన్నది కథ.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv