• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘తంగలాన్’: చియాన్ మార్క్ భీభత్సం

  చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నేడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీలో విక్రమ్ అర్ధనగ్నంగా వయసు మళ్లిన పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ కం హిస్టారిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని యూవీ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Courtesy Twitter: Eluru … Read more

  2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

  కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more

  ఈ వారం(sep 29, 30) థియేటర్‌/OTTలో వస్తున్న తెలుగు సినిమాలు

  తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం దసరా సందడి మొదలుకానుండగా ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలేవీ తలపడటం లేదు. దసరాకు గాడ్‌ఫాదర్‌, ది ఘోస్ట్ వంటి స్టార్ల సినిమాలు వస్తుండగా, ఈ వారం డబ్బింగ్‌ సినిమాల హవానే ఉంది. పొన్నియన్‌ సెల్వన్‌ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గురు, శుక్ర వారాల్లో తెలుగులో వస్తున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం. నేనే వస్తున్నా ధనుష్‌ డ్యూయల్‌ రోల్‌లో వస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం నేనే వస్తున్నా. ధనుష్‌, ఇలి అవ్రామ్‌, ఇందుజా, … Read more

  పొన్నియన్ సెల్వన్ ఎవరు? చోళ సామ్రాజ్యంలో ఈయన పాత్ర ఏంటి?

  పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం.  రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan) చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో … Read more

  చియాన్‌ విక్రమ్ అదిరిపోయే స్పీచ్‌

  పీఎస్‌1 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో భారతీయ సంస్కృతి, చారిత్రక గొప్పదనాన్ని చెబుతూ విక్రమ్‌ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం నెట్టింట వావ్‌ అనిపిస్తోంది. ఆయన మాట్లాడినంత సేపు అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో విక్రమ్‌తో పాటు జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి భారీ తారాగణం ఉంది.

  విక్ర‌మ్‌ ‘కోబ్రా’ తెలుగు ట్రైల‌ర్

  విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న మూవీ ‘కోబ్రా’ తెలుగు ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. విక్ర‌మ్ ఇందులో ఒక గ‌ణిత శాస్త్ర నిపుణుడిగా న‌టిస్తున్నాడు. ప్ర‌యోగాలు చేసేందుకు ఎప్పుడు ముందుండే విక్ర‌మ్ ఈ సినిమాలో వేర్వేరు గెట‌ప్స్‌లో క‌నిపించ‌డంతో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. శ్రీనిధి శెట్టి, మృణాళిని ర‌వి ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు. అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 31న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

  మొదటి ట్వీట్‌కే లైకుల వర్షం

  ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఇకపై ఇక్కడే ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ విక్రమ్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు క్రేజీ స్పందన వస్తోంది. ప్రస్తుతం విక్రమ్‌ నుంచి కోబ్రా చిత్రం రాబోతోంది. ఆగస్ట్ 15న సినిమా ట్రైలర్ వస్తుండగా…ఈ నెల చివరిలో సినిమా విడుదల చేసే అవకాశముంది. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ గణితవేత్తగా కనిపించనున్నారు. [వీడియో ](url) pic.twitter.com/G7Cl2BmhNg — Vikram (@chiyaan) August 12, 2022

  PS-1 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న PS-1 సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రం తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. PS-1 టీజర్ కు హీరో విక్రమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా దానికి సంబంధించిన వీడియోను మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  ‘విక్ర‌మ్’ మేకింగ్ వీడియో అదుర్స్‌

  క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ మూఈ జులై 3న హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌లో దూసుకెళ్తుంది. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ ఒక్కో స‌న్నివేశం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో చూడ‌వ‌చ్చు. డ్ర‌గ్స్ మాఫియా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సూర్య క్లైమాక్స్‌లో క‌నిపించి వైల్డ్ లుక్‌లో అద‌ర‌గొట్టాడు.