• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  బింబిసారా నుంచి ‘నీతో ఉంటే చాలు’ సాంగ్ విడుదల

  కళ్యాణ్ రామ్, వశిష్ఠ కాంబినేషన్‌లో వచ్చిన ‘బింబిసారా’ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ నుంచి ‘నీతో ఉంటే చాలు’ అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. కళ్యాణ్ రామ్, పాప మీద సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.

  ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

  బింబిసార విజయం తెలుగు సినిమాకు తిరిగి ఊపిరిపోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడిందని అన్నారు. థియేటర్లకు తిరిగి కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి విజయం రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఏ సినిమాకైనా డైరెక్టర్, హీరో, నిర్మాత చక్కగా కలిస్తే సినిమా అద్భుత విజయం సాధిస్తుందని బింబిసార మరోసారి నిరూపించిందని దిల్ రాజ్ పేర్కొన్నారు.

  బాక్సాఫీస్ రిక‌వ‌రీ మ‌ళ్లీ మొద‌లైందా?

  మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మ‌రోసారి రుజువైంది. ఆగ‌స్ట్ 5న విడుద‌లైన రెండు భారీ సినిమాలు సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నాయి. సాధార‌ణంగా రెండు బారీ బ‌డ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు కాస్త ఆలోచిస్తారు. కానీ వైజ‌యంతి మూవీస్‌, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ధైర్యం చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు రెండింటినీ ఆద‌రిస్తున్నారు. బింబిసార‌కు ఓవ‌ర్సీస్‌లో మొద‌టిరోజే 100k డాల‌ర్స్ గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ క‌లెక్ష‌న్లు … Read more

  బింబిసారుడి ఫ‌న్నీ ప్ర‌జాద‌ర్బార్‌

  క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచింది. తాజాగా బింబిసారుడి ప్ర‌జాద‌ర్భార్ పేరుతో చిత్ర‌బృందం స‌ర‌దాగా ముచ్చ‌టించుకున్నారు. సోష‌ల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్స్ క‌ళ్యాణ్‌రామ్‌ను సినిమా గురించి ప్ర‌శ్నించారు. ఈ సినిమాలో జుబేదాగా న‌టించిన న‌టుడు శ్రీనివాస్ రెడ్డి కామెడీతో అల‌రించాడు. ఈ సినిమాలో క్యాథ‌రిన్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వశిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  ‘బింబిసార’ టీమ్‌తో సుమ ఫ‌న్నీ తింట‌ర్వ్యూ

  క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ ఆగ‌స్ట్ 5న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచింది. ఏ సినిమా ప్ర‌చారానికైనా యాంక‌ర్‌ సుమ క‌చ్చితంగా ఉండాల్సిందే. ఆమె చిత్ర‌బృందాన్ని ఇంట‌ర్వ్యూ చేస్తే ఆ ఫ‌న్ వేరేగా ఉంటుంది. తాజాగా సుమ కొత్త‌రకంగా ఇంట‌ర్వ్యూ ట్రై చేసింది.క‌ళ్యాణ్ రామ్‌తో పాటు కీర‌వాణి, సంయుక్త మీన‌న్‌, డైరెక్ట‌ర్ ఇందులో పాల్గొన్నారు. హ్యాపీగా విందు భోజ‌నం చేస్తూ సినిమా గురించి విశేషాల‌ను పంచుకున్నారు. దీన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

  ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్‌టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

  క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన‌ ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎన్‌టీఆర్ మాట్లాడుతూ..’ఈ మ‌ధ్య‌కాలంలో ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంలేద‌ని అంటున్నారు. కానీ నేను అవ‌న్నీ న‌మ్మ‌ను. అద్భుత‌మైన సినిమాలు చేస్తే క‌చ్చితంగా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. బింబిసార చిత్రం అటువంటిదే. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార‌కు మందు..త‌ర్వాత అన్న‌ట్లు ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్‌ను అన్న‌య్య‌ త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌లేరు. దీనికోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మీకు న‌చ్చేవ‌ర‌కు మేము … Read more

  ట్రెండింగ్‌లో ‘బింబిసారా’ రిలీజ్ ట్రైలర్

  కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ‘బింబిసారా’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి నిన్న(జులై 27) రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్.. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 10 మిల్లియన్స్‌కు పైగా వ్యూస్, 2.5మిల్లియన్స్‌కు పైగా లైక్స్‌తో దూసుకెళ్లిపోతుంది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.

  ‘బింబ‌సార’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన బింబిసార మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే రెండు జ‌న్మ‌ల‌ను క‌నెక్ట్ చేసే క‌థ‌గా తెలుస్తుంది. క‌ళ్యాణ్‌రామ్ డైలాగ్స్‌, యాక్ష‌న్ అద‌ర‌గొట్టాడు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ట్రైల‌ర్‌ రిచ్‌గా ఉంది. విశిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 5న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  ‘బింబిసార’ నుంచి ఫోక్ సాంగ్ రిలీజ్

  క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ మూవీ నుంచి మ‌రో సాంగ్ రిలీజ్ అయింది. కేథ‌రిన్, క‌ళ్యాణ్‌రామ్‌పై తెర‌కెక్కించిన ఓ తేనే ప‌లుకుల అనే ఈ పాట‌ను హైమ‌త్ మ‌హ్మ‌ద్, స‌త్య యామిని క‌లిసి పాడారు. వ‌రికుప్ప‌ల యాద‌గిరి సంగీతం అందించాడు. ఫుల్ వీడియో సాంగ్ జులై 23న రిలీజ్ కానుంది. బింబిసార‌ను నాలుగు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు క‌ళ్యాణ్‌రామ్ వెల్ల‌డించాడు. మూవీ ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

  Categories Uncategorized