• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Telugu Movies On Amazon Prime: అమెజాన్‌లో గత పదేళ్లలో వచ్చిన టాప్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఇవే!

    ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. హర్రర్‌, కామెడీ, సైంటిఫిక్‌, హిస్టారికల్‌, బయోగ్రఫీ జానర్లలో ప్రతీవారం చాలా చిత్రాలే స్ట్రీమింగ్‌ (Suspense Thriller Movies Telugu In Prime)లోకి వస్తున్నాయి. అయితే ఎక్కువగా క్రైమ్‌ & సస్పెన్స్‌ థ్రిల్లర్లను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) ఆ జానర్లను ఎక్కువగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ అమెజాన్‌ క్రైమ్‌ & సస్పెన్స్‌ తరహాలో చాలా చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రం నేటికి కూడా ఆదరణకు నోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత పదేళ్లలో అమెజాన్‌లో వచ్చిన బెస్ట్ క్రైమ్‌ థ్రిల్లర్స్ ఏవి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    Contents

    చక్ర వ్యూహాం (Chakravyuham)

    సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈకేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే సరికి సిరి హత్యలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడతాయి. మరి ఇంతకీ సిరిని హత్య చేసింది ఎవరు? అనేది మిగిలిన కథ (Amazon Prime Latest Telugu Movies)

    మిడ్‌నైట్‌ మర్డర్స్‌ (Midnight Murders)

    అన్వర్ (కుంచకో బోబన్‌) ఒక సైకాలజిస్ట్ (Amazon Prime New Telugu Movies). పోలీసులకు కొన్ని స్పెషల్ కేసుల్లో హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మిడ్‌నైట్‌ పోలీసులు వరుసగా హత్యకు గురవుతుంటారు. అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? కిల్లర్‌ను అన్వర్‌ ఎలా పట్టుకున్నాడు? అన్నది కథ. 

    అథర్వ (Atharva)

    ఓ హత్య కేసును (Prime Video Telugu Movies)  క్లూస్‌ టీమ్‌ సాయంతో ఛేదించేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దర్యాప్తు కూడా మరింత సంక్లిష్టంగా మారుతుంది. చివరికీ ఆ కేసును ఎలా ఛేదించారు? అన్నది కథ.

    టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara rao)

    టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు అనేది కథ.

    హర్‌ చాప్టర్‌ 1 (Her: Chapter 1)

    హైద‌రాబాద్ శివార్ల‌లో జంట హ‌త్య‌లు జరుగుతాయి. ఆ హ‌త్య‌ల వెన‌క కార‌ణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చ‌నా ప్ర‌సాద్ (రుహానీ శ‌ర్మ‌) రంగంలోకి దిగుతుంది. ప‌లు కోణాల్లో ప‌రిశోధిస్తున్న క్ర‌మంలో కేసు ఊహించ‌ని మ‌లుపులు తీసుకుంటుంది. ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు? హంతకుల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో అర్చ‌న‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? అనేది మిగతా కథ.

    ముఖ చిత్రం (Mukhachitram)

    రాజ్ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. మహతి అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే రాజ్‌ను మాయా అనే యువతి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది. అతడి పెళ్లితో తీవ్ర నిరాశ చెందుతుంది. కొన్ని రోజుల తర్వాత రాజ్‌ జీవితంలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి.

    స్పై (Spy)

    జై(నిఖిల్) ‘రా’ ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తాడు. ఈ విధంగా ఓ మిషిన్‌లో పనిచేస్తూ ‘రా’ ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్(ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకునేందుకు ఆ కేసును ప్రభుత్వం జైకి అప్పగిస్తుంది. ఇంతకు సుభాష్ వర్ధన్‌ను ఎవరు చంపారు. ఈ కేసుకు ఫ్రీడం ఫైటర్ సుభాష్ చంద్రబోస్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.

    ఎవరు (Yevaru)

    సమీరాపై అత్యాచారం చేసే క్రమంలో సీనియర్ అధికారి అశోక్‌ హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాఫ్తును విక్రమ్ చేపడుతాడు. సమీరాను విచారిస్తున్న క్రమంలో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకు సమీరాకు అశోక్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథలో ట్విస్ట్.

    హిట్‌ : ది సెకండ్ కేసు (Hit : The Second Case)

    వైజాగ్‌లో (Amazon Prime Telugu Movies List) ఓ యువతి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారుతుంది. ఆ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) ప్రత్యేక అధికారిగా వస్తాడు. ఇంతకు హంతకుడు ఎవరు? మహిళలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడు అనేది మిగతా కథ

    బ్లఫ్‌ మాస్టర్‌ (Bluff Master)

    ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌) ప్రజలను మోసం చేస్తుంటాడు. అవని (నందిత శ్వేత) తన జీవితంలోకి అడుగుపెట్టాక మారతాడు. అయితే అతడికి పశుపతి (ఆదిత్య మీనన్‌) రూపంలో కొత్త సమస్య ఎదురవుతుంది. దాన్ని హీరో ఎలా అధిగమించాడు? అన్నది కథ.

    యూ టర్న్‌ (U turn)

    రచన (సమంత) జర్నలిస్టు. ఫ్లైఓవర్స్‌పై డివైడర్స్‌ దాటి యూటర్న్‌ తీసుకునేవారిపై రిసెర్చ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చేస్తాయి. ఆ తర్వాత ఏమైంది అన్నది కథ.

    అంజలి సీబీఐ (Anjali CBI)

    అంజలి (Prime New Movies Telugu) అనే సిబిఐ అధికారి, కొన్నేళ్ల క్రితం హత్యలు చేసి తప్పించుకున్న సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు బయలుదేరినప్పుడు ఆమె కుటుంబాన్ని ఆ కిల్లర్ టార్గెట్ చేస్తాడు.

    ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయా (Agent Sai Srinivas Athreya)

    ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.

    యశోద (Yashoda)

    యశోద (సమంత) పేద ఒక పేద యువతి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె తల్లి కావడానికి ఒప్పుకుంటుంది. ఆమెను మధు(వరలక్ష్మి శరత్ కుమార్)కి చెందిన ఎవా అనే సరోగసీ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ యశోద అద్దె గర్భం మాటున జరగుతున్న ఘోరాలు తెలుస్తాయి. సరోగసి మాఫియాతో సమంత ఎలా పోరాడింది? ఆ మాఫియా కోరల్లోంచి సమంత బయటపడిందా? అనేది కథ

    మత్తు వదలరా (Mathu Vadalara)

    బాబు, యేసు ఇద్దరు డెలివరీ ఏజెంట్లు, త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.

    ఎఫ్‌ఐఆర్‌ (FIR)

    ఇర్ఫాన్ అహ్మద్ (Suspense Thriller Movies Telugu In Prime) ఒక ల్యాబ్‌లో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. ఇంతలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ బక్కర్ అబ్దుల్లా కోసం NIA టీమ్ వెతికే క్రమంలో ఒక క్లూ లభిస్తుంది. దీంతో ఇర్ఫాన్‌ను టెర్రరిస్టు అని అరెస్ట్ చేస్తారు.

    గూడాఛారి (Goodachari)

    గోపి (అడివి శేషు) RAW ఏజెంట్‌. దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరతాడు. అనూహ్య ఘటన వల్ల అర్జున్‌పై దేశద్రోహం నేరం మోపబడుతుంది. దాని నుంచి అర్జున్‌ ఎలా బయటపడ్డాడు? ఒకప్పటి రా ఏజెంట్‌ అయిన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? అన్నది కథ.

    వి (V)

    క్లిష్టతరమైన కేసులను ఛేదిస్తూ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్‌కు… ‘V’ అనే సీరియల్ కిల్లర్ చిక్కుముడిగా మారుతాడు. తనను హత్యలు చేయకుండా అడ్డుకోవాలని పోలీస్‌ ఆఫీసర్‌ను ‘V’ సవాలు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

    డెవిల్ (Devil)

    ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని ఓ జమీందారు కూతురు హత్య జరుగుతుంది. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? అన్నది కథ.

    వెంకటాపురం (Venkatapuram)

    ఆనంద్, చైత్ర (Suspense Thriller Movies Telugu In Prime) అనే కాలేజీ విద్యార్థినితో ఒకే ఆపార్ట్‌మెంట్‌లో పక్క పక్కన నివసిస్తుంటారు. వీరిద్దరి మధ్య స్నేహం చిగురిస్తున్న సమయంలో చైత్ర హత్యకు గురవుతుంది. ఆనంద్‌ ఆ కేసులో ఇరుక్కుంటాడు.

    భాగమతి (Bhaagamathie)

    మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరామ్‌)పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆఫీసర్‌ వైష్ణవి (ఆశా శరత్‌) రంగంలోకి దిగుతుంది. గతంలో ఆయనకు సెక్రటరీగా ఉండి జైలు శిక్ష అనుభవిస్తున్న చంచల (అనుష్క)ను విచారణ నిమిత్తం భాగమతి బంగ్లాకు తీసుకెళ్తుంది. అయితే అది దెయ్యాల బంగ్లా. చంచల ఆ బంగ్లాకు వెళ్లినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మెుదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    తంతిరాం (Tantiram)

    భార్యాభర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే.. వారి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్న కథాంశంతో తంతిరం సినిమా రూపొందింది. జిన్‌లు అంటే ఎవరు? వారు ఏం కోరుకుంటారు? వంటి అనేక ఆసక్తికర అంశాల సమ్మేళనమే ఈ మూవీ.

    దృశ్యం 2 (Drushyam 2)

    పోలీస్ ఆఫీసర్ గీత (నదియా) కొడుకు హత్య కేసు నుంచి బయటపడ్డ రాంబాబు (వెంకటేష్) ఫ్యామిలీకి మళ్లీ ఆరేళ్ల తరువాత కష్టాలు మొదలవుతాయి. పోలీసులు వేసిన ఎత్తులు ఏంటి? దానికి రాంబాబు వేసిన పై ఎత్తులు ఏంటి? అన్నది కథ.

    సవ్యసాచి (Savyasachi)

    విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడు. ఆనందం, ఆందోళన సమయంలో వ్యాధి కారణంగా అతడి రెండో చేయి తీవ్రంగా స్పందిస్తుంది. ఇందుకు కారణం ఏమిటీ? తన భావ మరణానికి కారణమైన విలన్‌ (మాధవన్‌)పై అతడు ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది కథ.

    నిశబ్దం (Nishabdham)

    హంటెడ్‌ హౌస్ అని పిలిచే ఓ పాడుబడ్డ ఇంటికి పేయింటింగ్ కోసం సాక్షి, ఆంథోని అనే జంట వెళ్తారు. వీరిద్దరిలో ఒకరు చనిపోతారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి.

    నిను వీడని నీడను నేను (Ninu Veedani Needanu Nene)

    రిషి, దియా కొత్తగా పెళ్ళైన జంట. ఓ రోజు వారు ప్రయాణిస్తున్న కారు స్మశానం వద్ద ప్రమాదానికి గురవుతుంది. అప్పటి నుంచి వారి జీవితం తలకిందులవుతుంది. వారిది సహజ మరణమా? లేదా దాని వెనక ఎవరైనా ఉన్నారా? 

    వకీల్‌ సాబ్‌ (Vakeel Saab)

    ప‌ల్ల‌వి (నివేదా థామ‌స్‌), జ‌రీనా (అంజ‌లి), దివ్య నాయక్ (అన‌న్య నాగ‌ళ్ల‌) ఓ ఇంట్లో అద్దెకుంటారు. ఓ రోజు ఎంపీ కొడుకు పల్లవిపై లైంగిక దాడి చేయబోగా ఆమె తప్పించుకొని ఇంటికి వస్తుంది. ఆ త‌ర్వాత ప‌ల్ల‌విపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదవుతుంది. దీంతో అమాయ‌కులైన ముగ్గుర‌మ్మాయిలు క‌ష్టాల్లో ప‌డ‌తారు. ఆ సంద‌ర్భంలో వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌) వారికి ఎలా అండగా నిలబడ్డాడు? కోర్టులో ప‌ల్ల‌వి కేసుని ఎలా గెలిపించాడు? అన్నది కథ.

    బుజ్జి ఇలా రా (Bujji Ila Raa)

    నగరంలో చిన్నపిల్లలు వరుసగా కిడ్నాప్‌కి గురవుతుంటారు. ఈ కేసు సీఐ కేశవ (ధన్‌రాజ్‌)కు సవాలుగా మారుతుంది. దర్యాప్తులో కేశవ్‌కు షాకింగ్‌ విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరో పోలీసు అధికారి మహ్మద్‌ ఖయ్యూం (సునీల్‌) కేశవ్‌పై దాడి చేస్తాడు. అసలు ఈ ఖయ్యూం ఎవరు? పిల్లలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు? అన్నది కథ.

    కపటధారి (Kapatadhaari)

    గౌతమ్‌ (సుమంత్‌) ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. అతను విధులు నిర్వర్తిస్తున్న పరిధిలో 40 ఏళ్ల కిందట జరిగిన హత్యలకు సంబంధించి అస్తిపంజరాలు బయటపడతాయి. ఆ తర్వాత గౌతమ్‌ ఏం చేశాడు? కేసు దర్యాప్తులో అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    వంగవీటి (Vangaveeti)

    విజయవాడ (Best Telugu Movies On Amazon Prime) రౌడీయిజం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వంగవీటి రాధా ఆయన సోదరుడు మోహన రంగా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కింది.

    కనబడుటలేదు (Kanabadutaledu)

    సూర్య (సుక్రాంత్‌), శశిద (వైశాలిరాజ్‌) ప్రేమించుకొని విడిపోతారు. తర్వాత ఆదిత్య (యుగ్‌రామ్‌)ను పెళ్లి చేసుకున్న శశిద భర్త సాయంతో సూర్యను చంపాలనుకుంటుంది. సూర్య కోసం వారు వెతుకున్న క్రమంలో అతడు కనిపించకుండా పోతాడు. సూర్య కోసం రంగంలోకి దిగిన రామకృష్ణ (సునీల్‌) కేసును ఎలా ఛేదించాడన్నది కథ.

    ఒక్క క్షణం (Okka Kshanam)

    శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఎదైతే జరుగుతుందో అదే సంఘటనలు ఏడాది తర్వాత.. తమ జీవితాల్లో జరుగుతున్నట్లు జీవా, జోష్న గుర్తిస్తారు. స్వాతి హత్యకు గురైనప్పుడు, విధిని ఎదురించి జోష్నాను కాపాడేందుకు జీవా ఏం చేశాడు అనేది కథ

    జెంటిల్‌మెన్‌ (Gentleman)

    ఇద్దరు మహిళలు (Best Telugu Movies On Amazon Prime) వేర్వేరు సందర్భాల్లో ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అన్నది కథ.

    దృశ్యం (Drushyam)

    రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.

    రాగల 24 గంటలు (Raagala 24 Gantalu)

    ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాహుల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అనాథ అయిన విద్య. కానీ రాహుల్ హత్యకు గురవుతాడు. ఆ నేరం విద్య మీద పడుతుంది. నిజంగా రాహుల్‌ను హత్య చేసింది ఎవరు?

    1 నేనొక్కడినే (1: Nenokkadine)

    హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది కథ.

    అనామిక (Anamika)

    ఓ మహిళ (Best Telugu Movies On Amazon Prime) కనిపించకుండా పోయిన తన భర్త కోసం వెతుకుతుంటుంది. ఈ అన్వేషణలో ఆమెకు తెలిసిన షాకింగ్ నిజాలు ఏంటి? అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv