• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?

    నటీనటులు: కాజల్‌,  నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు

    రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల

    సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

    సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి

    ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌

    నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి

    విడుదల: 07-06-2024

    ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie Review). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? పోలీసు ఆఫీసర్‌గా కాజల్‌ ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో అదరగొట్టింది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఇక భర్తగా నవీన్‌ చంద్ర పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించలేదు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘సత్యభామ’ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించారు. సత్యభామ క్యారెక్టరైజేషన్‌ను బలంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆధారాల్ని చేజేతులా వదిలేస్తూ.. మళ్లీ వాటి కోసమే అన్వేషించడం కాస్త మైనస్‌గా మారింది. ఇంకాస్త బెటర్‌గా స్క్రీన్‌ప్లేను నడిపించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. అయితే సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. 

    టెక్నికల్‌గా 

    సాంకేతికంగా సినిమా ఒకే. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను, ఉత్కంఠ సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కాజల్‌ నటన
    • కొన్ని ట్విస్టులు
    • పతాక సన్నివేశాలు

    మైనస్‌ పాయింట్స్‌

    • పేలవమైన స్క్రీన్‌ప్లే
    • సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv