• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

    నింద

    వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది. 

    హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌

    చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.  జూన్‌ 21న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి.

    OMG

    హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు

    రక్షణ

    పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది. 

    బాక్‌

    సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

    కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3

    నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.

    TitleCategoryLanguagePlatformRelease Date
    Agent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18
    OutstandingMovieEnglishNetflixJune 18
    Maha RajSeriesHindiNetflixJune 19
    America’s SweetheartsSeriesEnglishNetflixJune 13
    NadigarMovieMalayalamNetflixJune 21
    Trigger WarningMovieEnglishNetflixJune 21
    Bad CopMovieHindiDisney + HotstarJune 21
    The HoldoversMovieEnglishJio CinemaJune 16
    House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17
    IndustrySeriesEnglishJio CinemaJune 19
    Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv