• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?

    గత శుక్రవారం (జూన్‌ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్‌ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్‌లో వాటి కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. 

    మనమే’ 3 డేస్‌ కలెక్షన్స్‌

    శర్వానంద్‌ లేటెస్ట్ మూవీ ‘మనమే‘కు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్‌లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్‌ (Gross) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్‌ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి.

    కథేంటి

    విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర – విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ. 

    వీకెండ్‌లో నిరాశ పరిచిన ‘సత్యభామ’

    కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ‘. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 7) విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్‌ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్‌ (Gross) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి.

    కథేంటి

    ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv