నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
డైరెక్టర్: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది. అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. ‘ఇయ్యాలే పొయ్యాలే… గట్టిగా అరిస్తే తొయ్యాలే… అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే’ వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు. మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్
బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్ ట్రాక్‌తో నడిపిన బోయపాటి… సెకండాఫ్ నుంచి కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.
బలం
బోయపాటి మార్క్ డైరెక్షన్
రామ్ మాస్ యాక్టింగ్
శ్రీలీల అందం
థమన్ BGM
బలహీతనలు
అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు
చివరగా:
మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం