Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య – సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య – సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌! 

    Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య – సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌! 

    September 30, 2024

    అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై  అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌ కోసం సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

    శివరాత్రి స్పెషల్ సాంగ్‌

    నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్‌’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. శివరాత్రి థీమ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్‌ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్‌. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్‌. షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు. 

    తండేల్‌ స్టోరీ ఇదే

    నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్‌ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్‌ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు. 

    చైతూ ఆశలన్నీ తండేల్‌ పైనే!

    ప్రస్తుతం నాగ చైతన్య తన  ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్‌ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ‘100 పర్సెంట్ లవ్’ నిర్మించింది. 

    సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌

    ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి ‘అమరన్‌’ అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్‌ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version