This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్‌.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్‌.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే! 

    This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్‌.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే! 

    September 16, 2024

    సెప్టెంబర్‌ మూడో వారంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్‌ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే ‘దేవర’ రిలీజ్‌ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు రీరిలీజ్‌ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    గొర్రె పురాణం

    టాలీవుడ్‌ యువ నటుడు సుహాస్‌ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.

    యుద్ర

    సిద్ధాంత్‌ చతుర్వేది, మాళవిక మోహనన్‌ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్‌, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్‌ చేశారు. 

    కహా షురూ.. కహా ఖతం

    ధ్వని భానుశాలి, ఆషిమ్‌ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్‌ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ మూవీకి కథను అందించడం విశేషం.

    బొమ్మరిల్లు 

    సిద్ధార్థ్‌, జెనీలియ జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘బొమ్మరిల్లు’ (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే.  2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది.  సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.

    జర్నీ

    తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్‌, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్‌ యాక్సీడెంట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్‌ కానుంది. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

    తంగలాన్‌

    తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’ (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్‌ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుస‌న్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.

    తిరగబడరా సామి

    రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘తిర‌గ‌బ‌డ‌రా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్‌ టాక్ తెచ్చుకుంది.  స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. 

    హంట్

    మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబ‌ర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 29న థియేట‌ర్ల‌లో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. భావ‌న యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కార‌ణంగా హంట్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

    ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్

    అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది. 

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Grave TortureMovieEnglishNetflixSept 16
    Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17
    Fast XMovieEnglishNetflixSept 18
    Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18
    Twilight of the GodsSeriesEnglishNetflixSept 19
    He’s Three DaughtersMovieEnglishNetflixSept 20
    Evil Dead RiseMovieEnglishNetflixSept 21
    Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26
    A very Royal Scandal SeriesEnglishAmazonSept 19
    Stree 2MovieHindiAmazonSept 27
    DurgaMovieHindiJio CinemaSept 16
    Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20
    The PenguinSeriesEnglishJio CinemaSept 29
    UnPrisonedMovieEnglishHotstarSept 16
    Agatha All AlongMovieEnglishHotstarSept 17
    The Judge From HellSeriesEnglishHotstarSept 21
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version