కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యామిలీ స్టార్(Family Star)
రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా… పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం‘ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.
భరత నాట్యం
కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన మంజుమ్మల్ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
ప్రొజెక్ట్
లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం ‘మాయవన్’… తెలుగులో ప్రొజెక్ట్‌గా రానుంది. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ, జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.
బహుముఖం
హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్ అండ్ యాక్టర్ ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా స్వర్ణిమా సింగ్, మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Together | Series | English | Netflix | April 2 |
Files Of The Unexplained | Series | English | Netflix | April 3 |
Ripley | Series | English | Netflix | April 4 |
Scoop | Series | English | Netflix | April 5 |
Musica | Movie | English | Amazon prime | April 5 |
Yeh Meri Family | Series | Hindi | Amazon prime | April 4 |
How to Date Billy Walsh | Series | English | Amazon prime | April 5 |
Farrey | Movie | Hindi | Zee5 | April 5 |
Lambasingi | Movie | Telugu | Disney+ Hotstar | April 2 |
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..