This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

    September 4, 2023

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచిసెప్టెంబర్‌ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    జవాన్‌

    బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి.

    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

    అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.

    ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    జైలర్‌

    సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘జైలర్‌’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు.

     

    TitleCategoryLanguagePlatformRelease Date
    Shane GillisMovieEnglishNetflixSep 05
    Scout’s HonorMovieEnglishNetflixSep 05
    kung fu panda 3SeriesEnglishNetflixSep 07
    top boy season 2SeriesEnglishNetflixSep 07
    One shotSeriesEnglishAmazon primeSep 07
    Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06
    i’m groot season 2SeriesEnglishDisney + HotstarSep 06
    LoveMovieTamilAhaSep 08
    Love on the roadMovieEnglishBook My ShowSep 08

    .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version