Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన బన్నీ ఫ్యాన్స్‌.. నెట్టింట వాడీ వేడీ చర్చ! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన బన్నీ ఫ్యాన్స్‌.. నెట్టింట వాడీ వేడీ చర్చ! 

    Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన బన్నీ ఫ్యాన్స్‌.. నెట్టింట వాడీ వేడీ చర్చ! 

    January 7, 2025

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను హీరో అల్లు ‌అర్జున్‌ తాజాగా పరామర్శించారు. పోలీసుల ఆంక్షల మధ్య ఆస్పత్రికి వెళ్లిన బన్నీ.. బాధితుడి యోగ క్షేమాల గురించి స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #AlluArjun హ్యాష్‌ట్యాగ్‌ను బన్నీ ఫ్యాన్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త అంశాన్ని అల్లు అభిమానులు లేవనెత్తుతున్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల అంశాన్ని హైలెట్‌ చేస్తున్నారు. బన్నీకో రూల్‌.. పవన్‌ కల్యాణ్‌కు మరో రూలా అంటూ నిలదీస్తున్నారు. 

    ఏం జరిగిందంటే?

    ఏపీలోని రాజమండ్రిలో శనివారం (డిసెంబర్‌ 4) ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. హీరో రామ్‌ చరణ్‌, నిర్మాత దిల్‌రాజుతో పాటు చిత్ర బృందమంతా అటెండ్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌ చూసేందుకు వచ్చిన మెగా అభిమానులు తోకడ చరణ్‌, ఆరవ మణికంఠ అనే ఇద్దరు యువకులు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్‌కు గురై మరణించారు. దీనిపై ఎక్స్‌వేదికగా స్పందించిన పవన్‌ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అటు నిర్మాత దిల్‌ రాజు రూ.5 లక్షలు అందించనున్నట్లు చెప్పారు. 

    పవన్‌కు మానవత్వం లేదా?

    సంథ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల పవన్‌ స్పందిస్తూ ఎక్కడో మానవీయ కోణం లోపించిందని అన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్‌ ప్రస్తావిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు యాక్సిడెంట్‌ జరిగిన రోడ్డు సరిగా లేదంటూ గత ప్రభుత్వంపైకి ఘటనను తోసివేయడాన్ని తప్పుబడుతున్నారు. ‘సినిమాలకెళ్లి చొక్కాలు చించుకోకపోతే.. బైక్‌ యాక్సలేటర్‌ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎక్కడికి పోతుంది’ అని ఈవెంట్‌కు వచ్చిన యూత్‌ను పవన్‌ రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు. 

    ఆ రెండు ఘటనల్లో తేడా ఏముంది?

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట, గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌ను బన్నీ ఫ్యాన్స్‌ లింకప్‌ చేస్తున్నారు. తొక్కిసలాటకు పరోక్షంగా బన్నీ బాధ్యుడైతే.. ఈ యాక్సిడెంట్‌కు పవన్‌, చరణ్‌ కూడా బాధ్యులు కాదా? అని నిలదీస్తున్నారు. అప్పుడు అల్లు అర్జున్‌ అరెస్టు మీకు కరెక్ట్‌ అనిపించినప్పుడు.. ఇప్పుడు పవన్‌ను కూడా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలకు వైకాపా పార్టీ సైతం మద్దతు తెలుపుతోంది. ఆ పార్టీకి చెందిన అంబటి రాంబాబు తాజాగా ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి మరి ఈ అంశంపై పవన్‌ను తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి రోజా కూడా బాధిత కుటుంబాల రోదనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. 

    మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

    యాక్సిడెంట్‌ను ఆయుధంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌, వైకాపా నేతలకు మెగా ఫ్యాన్స్‌ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ అభిమాని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని చివర్లో పవన్‌ రెండు చేతులు జోడించి మరి సూచించారని గుర్తు చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారన్న విషయాన్ని కూడా పవన్‌ చెప్పారన్నారు. మీ కుటుంబ సభ్యుల్ని అడిగానని చెప్పమన్న పవన్ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానుల క్షేమం కోసం పాటుపడే వ్యక్తి పవన్ అంటూ ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైందని పోస్టులు పెడుతున్నారు. 

    శ్రీతేజ్‌ను పరామర్శించిన బన్నీ

    ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్‌ తాజాగా పరామర్శించారు. బాలుడు చికిత్స పొందుతున్న సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రికి బన్నీ వెళ్లారు. అతడితో పాటు FDC ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు కూడా ఆస్పత్రికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న బన్నీ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బన్నీ రాక నేపథ్యంలో హాస్పిటల్ పరిసరాల్లో భారీగా  బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. బాలుడ్ని పలకరించిన అనంతరం బన్నీ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version