Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?

    Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?

    April 1, 2024

    స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్  వస్తుండటంతో.. వసూళ్లు భారీగా రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్(Tillu Square  Weekend Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్‌గా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఏ టాలీవుడ్ మూవీ రాబట్టలేదు. ఈ చిత్రం ఈవారంలో రూ.100కోట్ల మార్క్‌ను అవలీలగా దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు.  ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.37 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.31కోట్లు గ్రాస్ రాబట్టింది.  సిద్ధు జొన్నలగడ్డ  గత చిత్రాల్లో టిల్లు స్కేర్ కలెక్షన్లు ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

    నెట్ వసూళ్లు ఎంతంటే?

    ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Weekend Net Collections)  మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40-45 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిసింది.

    లాభాల్లో టిల్లు స్కేర్

    ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండటంతో… మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ  గత చిత్రం ‘డీజే టిల్లు చిత్రం’ బ్లాక్‌ బాస్టర్‌ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే(Tillu Square 3days Collections) జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 24కోట్లుగా ఉంది. ఇప్పటికే ఈ టార్గెట్‌ను దాటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు రూ.15కోట్ల లాభం కళ్లజూపింది.

    టిల్లు స్కేర్ సక్సెస్‌ కారణం ఇదేనా?

    స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్‌ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి.

    ఓటీటీ పార్ట్నర్‌  ఫిక్స్

    టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకుంది. చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం… ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    టిల్లు క్యూబ్ 

    మరోవైపు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో ఈరోజు నుంచి ఈ ప్రకటన వేయనున్నట్లు పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version