కేరళలో పుట్టిన అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ అభిమానులందరికీ పరిచయమే. కేరళలో పుట్టిన ఈ ముద్దు గుమ్మ అ ఆ సినిమాతో తెలుగు తెరకు 2016లో పరిచయమైంది. ఈ బ్యూటీ అంతకు ముందే మలయాళ ప్రేమమ్ మూవీతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేసే సమయంలో కూడా ఈ బ్యూటీని తీసుకున్నారు. ఇక 2016 నుంచి ఈ చిన్నది తెలుగు నాట వరుసగా సినిమాలు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 2021 చివరి వరకు ఈ బ్యూటీ తెలుగులోనే 8 చిత్రాలలో నటించింది.
రౌడీ బాయ్స్‌తో కలిసి..
ఇక ఈ చిన్నది 2022 సంక్రాంతికి దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ రెడ్డితో కలిసి రౌడీ బాయ్స్ అనే సినిమాను చేసింది. ఈ సినిమాలో ఓ మెడికల్ స్టూడెంట్‌గా నటించిన అనుపమ కొత్త కుర్రాడు ఆశిష్‌కు లిప్ కిస్ కూడా ఇచ్చింది. దీని మీద పెద్ద రాద్దాంతమే జరిగింది. అనేక మంది అనుపమను ఈ వివాదంపై ట్రోల్ చేశారు. అయినా కానీ అనుపమ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.
సింగర్‌గా మారిన చిన్నది..
బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అంటూ రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్‌ను అనుపమ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు తన వద్ద సింగింగ్ టాలెంట్ కూడా ఉందని ఈ బ్యూటీ ప్రూవ్ చేసుకుంటుంది. అనుపమ పాడిన ఈ పాటను మీరూ చూసేయండి.
‘మీరు సింగర్‌గా కూడా ట్రై చేయొచ్చు’
రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయిన చిన్నది..
- రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోయింది. ఈ చిన్నదాని చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే ఈ కేరళ కుట్టి అనేక తెలుగు సినిమాలు చేయడమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా నటించి మెప్పించింది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి