ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    March 20, 2023

    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు. 

    దాస్ కా ధమ్కీ

    టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది. 

    రంగ మార్తాండ

    కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది. ప్రకాశ్ రాజ్‌, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది.

    ఘోస్టీ 

    వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్‌ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది. 

    గీత సాక్షిగా

    ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్‌ సాగే చిత్రమని అర్థమవుతుంది.

    ఓటీటీ సినిమాలు

    Title CategoryLanguagePlatformRelease Date
    Panchatantram Movie Telugu ETV WinMarch 22
    Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22
    American apokalipseMovieEnglishNetflixMarch 22
    Jhony Movie EnglishNetflixMarch 23
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version