Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!

    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!

    October 11, 2024

    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా ‘వేట్టయన్ – ద హంటర్’ (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం.

    డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

    రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

    ఎప్పటికీ తలైవా ఒక్కరే.. 

    ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు. 

    ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌!

    ‘జై భీమ్’ వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ ‘వేట్టయన్‌’తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ – రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. 

    కథేంటి

    పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version