Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!

    Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!

    December 20, 2024

    నటీనటులు: విజయ్​ సేతుపతి, సూరి, మంజు వారియర్, కిషోర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ, గౌతమ్ మీనన్ తదితరులు

    దర్శకత్వం : వెట్రిమారన్‌

    సంగీతం: ఇళయరాజా

    సినిమాటోగ్రఫీ : ఆర్. వెల్‌రాజ్

    నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ 

    విడుదల తేదీ: డిసెంబర్‌ 20, 2024

    గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందింది. ‘విడుదల 2’ (Vidudala Part 2 Review) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), మంజు వారియర్‌, గౌతమ్‌ మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, డిసెంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో తొలిభాగం ముగియగా అతడి విచారణతో పార్ట్ 2 మొదలవుతుంది. పెరుమాళ్‌ను క్యాంప్ నుండి వేరే బేస్‌కి మార్చాలని పోలీసులు డిసైడ్‌ అవుతారు. అతడి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కుమరేశన్ (సూరి)తో కలిసి బయలుదేరతారు. ఈ క్రమంలో పోలీసులతో పెరుమాళ్‌ తన కథను పంచుకుంటాడు. అతడి స్టోరీ విన్నాక పోలీసులకు అతడిపై జాలి కలుగుతుంది. దీంతో పెరుమాళ్‌ అరెస్ట్‌ను సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటారు. అయితే అరెస్టు విషయం మీడియాకు లీక్‌ కావడంతో అధికారికంగా అనౌన్స్‌ చేసేందుకు పోలీసులు రెడీ అవుతారు. ఈ క్రమంలోనే పెరుమాళ్‌ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు పోలీసులు ఏం చేశారు? అతడ్ని పట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశారు? ఇంతకీ పోలీసులకు పెరుమాళ్‌ చెప్పిన గతం ఏంటి? అతడు ఉధ్యమనాయకుడిగా ఎలా మారాడు? పెరుమాళ్‌ మంచితనం గురించి తెలిసిన కుమారేశన్ ఎవరివైపు నిలబడ్డాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    పెరుమాళ్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి (Vidudala Part 2 Review) అదరగొట్టాడు. కుర్రతనం నుంచి ఉద్యమ నాయకుడిగా ఎలా ఎదిగాడన్న పాత్రలో జీవించేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో ఎప్పటిలాగే తన నటనతో కట్టిపడేశాడు. తొలి భాగాన్ని తన భుజంపై వేసుకొని నడిపించిన నటుడు సూరి సెకండ్‌ పార్ట్‌కు వచ్చేసరికి కొన్ని సీన్లకే పరిమితమయ్యాడు. అతడికి ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ దొరకలేదు. ఉన్నంతలో బాగానే చేశాడు. ఇండిపెండెంట్‌ ఉమెన్‌ పాత్రలో మంజు వారియర్‌ ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా గౌతమ్‌ మీనన్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. విలన్‌ షేడ్స్‌ ఉన్న పోలీసు ఆఫీసర్‌ చేతన్‌ మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ చూపించిన రోల్‌ చేతన్‌దే. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు వెట్రిమారన్‌.. గౌతమ్ మీనన్విజయ్ సేతుపతిల మధ్య వచ్చే ఇంటరాగేషన్ సీన్‌తో కథను ప్రారంభించారు. ఆపై వెంటనే ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి ఆడియన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి, మంజు వారియర్‌ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా చూపించారు. అలాగే పోలీస్ వ్యవస్థ, రాచరికపు దురహంకారం, ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుంది వంటి విషయాలను ఏమాత్రం బెరుకు లేకుండా దర్శకుడు చూపించాడు. శాంతియుతంగా సాగే ఉద్యమం హింసా మార్గం ఎలా పట్టిందనే పాయింట్‌ను చాలా బలంగా చూపించారు. తొలి భాగం వరకూ కథ బాగానే సాగినప్పటికీ సెకండాఫ్‌కు వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ముందు సీన్లో చనిపోయిన క్యారెక్టర్లు తర్వాతి సీన్‌లో కనిపించడం గందరగోళానికి గురిచేస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ చిరాకు తెప్పిస్తాయి. సీన్స్‌ మధ్య కనెక్టివిటీ ఉండదు. క్లైమ్యాక్స్ కూడా చాలా లెంగ్తీగా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. 

    సాంకేతికంగా..

    టెక్నికల్ అంశాలకు వస్తే (Vidudala Part 2 Review) ఇళయరాజా సంగీతం సినిమాగా బాగా ప్లస్‌ అయ్యింది. పావురమా పాట వినడానికి చాలా బాగుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం నేచురల్ లొకేషన్లలోనే తీశారు. అది స్క్రీన్‌పై మంచి ఎఫెక్ట్ చూపించింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • విజయ్ సేతుపతి నటన
    • సందేశాత్మక సన్నివేశాలు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సెకండాఫ్‌
    • అతుకుల బొంతలా ఉండే  సీన్స్‌
    Telugu.yousay.tv Rating : 2.5/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version