Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ – 10 సీక్రెట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ – 10 సీక్రెట్స్

    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ – 10 సీక్రెట్స్

    May 9, 2023

    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం..

    1. విజయ్‌ తండ్రి కల

    విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. 

    2. బాల నటుడిగా..

    విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది. 

    3. ఇంగ్లీష్‌ టీచర్‌గా..

    విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు. 

    4. నటనలో ఓనమాలు

    ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు. 

    5. తొలి సినిమా

    ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది. 

    6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు

    అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు. 

    7. ఒకేసారి 6 సినిమాలు

    2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు. 

    8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం

    2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ – 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు. 

    9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్

    2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు. 

    10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు


    అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version