Vijay Devarakonda Top 5 Movies
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Devarakonda Top 5 Movies

    Vijay Devarakonda Top 5 Movies

    February 3, 2023

    విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న చిన్న పాత్ర‌ల‌తో త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయ‌న కెరీర్‌ను ఒక్క‌సారిగా మ‌లుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి . ఒక్క సినిమాతోనే ఇంత పేరు సంపాదించిన హీరో దాని వెన‌క ప‌డ్డ క‌ష్టాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొత్త‌గా వ‌చ్చే హీరోల‌కు ఆద‌ర్శంగా నిలిచాడు విజ‌య్. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి సపోర్ట్ లేకుండా అగ్ర‌స్థాయికి చేరిన విధానం అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రుస్తుంది. మరి విజయ్ దేవ‌రకొండ సినిమాల్లో టాప్ 5 మూవీస్ ఏంటో చూసేద్దాం.

    1. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం(2015)

    లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా సినిమాలో చిన్న పాత్ర‌లు చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా న‌టించిన ఎవ‌డే సుబ్ర‌మణ్యం సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. నాని బెస్ట్‌ ఫ్రెండ్‌గా క‌నిపించిన విజ‌య్ ఉత్సాహ‌మైన పాత్ర‌లో లైఫ్ అంటే ఎప్పుడు డ‌బ్బు మాత్ర‌మే కాద‌ని ఇంకేదో ఉంద‌ని దూద్ కాశీకి తీసుకెళ్లి హీరో మ‌న‌సు మార్చుతాడు. ఈ సినిమాలో విజ‌య్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. 

    2. పెళ్లి చూపులు(2016)

    పెళ్లి చూపులు సినిమాను సాధార‌ణ కెమెరాల‌తో సిటీలో అక్క‌డ‌క్క‌డా కొన్ని లొకేష‌న్ల‌లో తీసిన చిన్న సినిమా. క‌థ యువ‌త‌కు క‌నెక్ట్ కావ‌డంతో అనుకోకుండా భారీ హిట్ సాధించింది. మొద‌టి సినిమాతోనే ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌కు నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చాడు. అత‌డు న్యాచుర‌ల్‌గా క‌థ‌లో జీవించిన విధానం, మాట్లాడే భాష, డైలాగ్ డెలివ‌రీ ఇలా ప్ర‌తి ఒక్క అంశం ఆక‌ర్షింపజేశాయి. చిన్న పాత్ర‌లు చేసుకునే స్థాయి నుంచి విజ‌య్‌ను హీరోగా నిల‌బెట్టిన సినిమా ఇది.

    3. అర్జున్ రెడ్డి (2017)

    అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు విజ‌య్. ఇది టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ  మూవీ చుట్టూ చాలా వివాదాలు చెల‌రేగాయి. కానీ అవే సినిమాకు ప‌బ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఒక డాక్ట‌ర్‌గా, భ‌గ్న ప్రేమికుడిగా విజ‌య్ బోల్డ్ యాక్టింగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా యువ‌త‌కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా భారీ హిట్‌గా నిలిచింది.  దీంతో ఇండస్ట్రీలో విజ‌య్ పేరు మార్మోగిపోయింది. ఇప్ప‌టికీ కూడా విజ‌య్‌ని అర్జున్ రెడ్డిగానే పిలుచుకునేంత‌గా ఈ సినిమా జ‌నాల్లోకి దూసుకెళ్లింది.

    4. గీతా గోవిందం (2018)

    అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమా చేసిన త‌ర్వాత పూర్తి విభిన్న‌మైన పాత్ర‌లో న‌టించాడు విజ‌య్. కాలేజ్ లెక్చ‌ర‌ర్‌గా ఈ సినిమ‌లో క‌నిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి చుట్టూ మేడ‌మ్ మేడ‌మ్ అంటూ తిరిగే అమాయ‌క‌పు యువ‌కుడిలా న‌టించి మెప్పించాడు. అర్జున్ రెడ్డి వంటి సినిమా త‌ర్వాత కూడా విజ‌య్‌ను ఇలాంటి పాత్ర‌లో ఇష్ట‌ప‌డ్డారంటే అది అంతా విజ‌య్ న‌ట‌న అని చెప్పాలి. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా కూడా  భారీ స‌క్సెస్‌ను సాధించింది. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. 

    5. లైగ‌ర్(2022)

     పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమా లైగ‌ర్. ఈచిత్రంపై ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటంటే మొద‌టిసారిగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ మ‌న తెలుగు సినిమాలో న‌టించ‌నున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ మూవీ కోసం విజ‌య్ పూర్తిగా డిఫ‌రెంట్‌ మేకోవ‌ర్‌తో ఇంప్రెస్ చేశాడు. భారీగా కండ‌లు పెంచి సిక్స్ ప్యాక్‌తో క‌నిపించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌తో అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమాతో భారీ హిట్ కొడ‌తామ‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు విజ‌య్‌. ఆగ‌స్ట్ 25న లైగ‌ర‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version