Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!

    Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!

    April 23, 2024

    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    విశ్వంభరలో అలనాటి నటి!

    విశ్వంభరలో చిరుకి జోడీగా నటి త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్‌ విజయశాంతి (Vijayashanti) కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ ప్రకారం సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరును మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ఆమెను ఒప్పించే పనిలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే విశ్వంభరపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి – విజయశాంతి జోడీగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇన్నాళ తర్వాత మళ్లీ వీరిద్దరిని తెరపై చూడటమంటే అది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. 

    చిరు కెరీర్‌లోనే తొలిసారి!

    ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ కూడా చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 26 రోజులు షూటింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. షూట్‌లో చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్‌లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నిర్వహించారు. కాగా, ఈ సీక్వెన్స్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, మెగా బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు.. ఈ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్‌ను కలవడం గమనార్హం.

    మెగాస్టార్‌ స్పెషల్‌ పోస్టు

    మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు (ఏప్రిల్‌ 23) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరు తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు. దీనికి విశ్వంభ‌ర సెట్స్ నుంచి తీసిన హనుమంతుడి ఫొటోను జత చేయడంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version