VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్

    VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్

    May 3, 2023

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన T2 మోడల్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. VIVO T1కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం.

    VIVO T2

    VIVO T2 ఫోన్లకు భారత్‌లో మంచి  ఆదరణ ఉంది. పైగా మార్కెట్లో ఉన్న OnePlus Nord CE3 Lite 5G, Redmi Note 12 5G, Moto G73 5G, iQoo Z7 5G ఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. రూ.20 వేల లోపు బడ్జెట్‌లో 5G ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్. 

    డిస్‌ప్లే

    ఈ ఫోన్‌ డిస్‌ప్లే సైజు 6.38(16.21cm) అంగులాలు ఉంటుంది. ఫుల్ హెచ్‌డీతో పాటు అమోల్డ్‌ డిస్‌ప్లే టైప్‌తో రూపుదిద్దుకుంది. 1080 x 2400 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. 

    ప్రాసెసర్‌

    స్నాప్ డ్రాగన్ 695 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 13 వెర్షన్‌తో 2.2 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిజైన్ అయింది. 

    మెమోరీ

    వివో T2 రెండు రకాల స్టోరేజీలతో వస్తోంది. 128GB + 8GB, 128GB + 8GB వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది. 

    కెమెరా

    ఫోన్‌కి వెనకాల డ్యుయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన 64MP ప్రైమరీ కెమెరాతో పాటు 2 MP పోర్ట్‌రైట్ లెన్స్‌ కలిగిన మరో కెమెరా ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు అల్ట్రా వైడ్ కెమెరా లేకపోవడం గమనార్హం. ఈ రెండింటితో1080P క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

    బ్యాటరీ

    T2 5Gలో 4500mAh సామర్థ్యంతో లిథియం బ్యాటరీ సౌకర్యం ఉంది. T1లో 5000mAh ఉండేది.  ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 44W ఛార్జర్‌ను ఇస్తున్నారు. 

    మరికొన్ని

    రెండు రంగుల్లో ఫోన్‌ను రూపొందించారు. నైట్రో బ్లేజ్, వెలాసిటీ వేవ్ కలర్స్‌లో తీసుకువచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. ఏడాది పాటి వారంటీ లభిస్తోంది.

    ధర

    వివో T2 128GB + 6GB RAM ఫోన్‌ ధర రూ. 18,999గా ఉంది. 128+8GB వేరియంట్ ధర రూ.20,999కు లభిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర ఫోన్లకు గట్టి పోటీని ఇస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version