Weekend OTT Suggestions: వీకెండ్‌లో కల్కి టికెట్స్‌ దొరకలేదా? ఈ ఓటీటీ చిత్రాలతో ఎంజాయ్‌ చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestions: వీకెండ్‌లో కల్కి టికెట్స్‌ దొరకలేదా? ఈ ఓటీటీ చిత్రాలతో ఎంజాయ్‌ చేయండి!

    Weekend OTT Suggestions: వీకెండ్‌లో కల్కి టికెట్స్‌ దొరకలేదా? ఈ ఓటీటీ చిత్రాలతో ఎంజాయ్‌ చేయండి!

    June 28, 2024

    ఈ వీకెండ్‌ థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ హవా నడుస్తోంది. టికెట్లు దొరకని వారు ఈ వీకెండ్‌ ఎలా ఎంజాయ్‌ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కానీ, ఈ వీకెండ్‌ ఎప్పటిలాగే వస్తూ వస్తూ బోలుడన్ని కొత్త సినిమాలను తీసుకొచ్చింది. లేటెస్ట్‌ సినిమాలను చూడాలనుకునేవారికి ఈ వీక్ మంచి వినోదం దొరుకుతుందని చెప్పవచ్చు. ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకున్న కొన్ని సినిమాలు ఈ వారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    భజే వాయు వేగం

    కార్తికేయ (Kartikeya) హీరోగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌. మే 31న థియేటర్లో రిలీజైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈనెల 28 (Bhaje Vaayu Vegam OTT Release Date) నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పుడే అనాథగా మారిన వెంకట్‌ను… రాజన్న దత్తత తీసుకుంటాడు. కొడుకు రాజుతో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వెంకట్‌.. విలన్ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేస్తాడు. వారు మోసం చేయడంతో పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది కథ.

    లవ్‌ మౌళి

    నటుడు నవదీప్‌ (Navdeep) తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. రానా ఇందులో అఘోరాగా నటించారు. జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. పర్వాలేదనిపించింది. ఈ నెల 27 నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. ‘ఆర్టిస్ట్ అయిన మౌళి.. తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. అతడికి ప్రేమపై నమ్మకం ఉండదు. ఈ క్రమంలో ఓ అఘోరా అతడికి మహిమ గల పెయింటింగ్‌ బ్రష్‌ ఇస్తాడు. దాని సాయంతో తనకు నచ్చిన లక్షణాలున్న యువతిని మౌళి సృష్టించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది కథ.

    సత్యభామ

    కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ‘ కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. జూన్‌ 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల‌లోనే (జూన్ 7)న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మౌత్ టాక్‌తో మంచి విజ‌యం సాధించింది. కాజ‌ల్‌కు జంట‌గా న‌వీన్ చంద్ర (Naveen Chandra) న‌టించ‌గా.. ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj), హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ (Harsha Vardhan), నేహా ప‌ఠాన్‌, పాయ‌ల్ రాధా కృష్ణ (Payal Radhakrishna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఏసీపీ సత్యభామ.. షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఆమెను హసినా అనే బాధితురాలు కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెప్పుకొని వాపోతుంది. ఈ క్రమంలో హసినా.. భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యభామ.. నేరస్థుడిని ఎలా పట్టుకుంది? దర్యాప్తులో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది కథ.

    గురువాయుర్‌ అంబలనాదయిల్‌

    పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil). విపిన్‌ దాస్‌ దర్శకుడు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూన్‌ 27 నుంచి ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కథ ఏంటంటే.. రామచంద్రన్‌కు నిశ్చితార్థం జరిగినప్పటికీ బ్రేకప్‌ అయిన అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో బావమరిది ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌).. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు రామచంద్రన్‌కు సాయం చేస్తుంటాడు. అయితే ఓ వ్యక్తి కారణంగా వీరి బంధం బీటలు వారుతుంది. ఆ తర్వాత ఏమైంది? రామచంద్రన్‌ పెళ్లి చేసుకున్నాడా? ఆనంద్‌ తన భార్యను కలిశాడా? లేదా?’ అన్నది కథ.

    సివిల్‌ వార్‌

    ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ కూడా సిద్ధంగా ఉంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ హీరోయిన్.. క్రిస్టెన్ డన్స్ట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్.. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీషుతోపాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, ఈ వీకెండ్‌లో మంచి యాక్షన్‌ సినిమాను చూడాలని భావిస్తున్న వారికి ‘సివిల్‌ వార్‌’ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. 

    విందు భోజనం

    అఖిల్‌రాజ్‌, ఐశ్వర్య ప్రధాన పాత్రలుగా కార్తిక్‌ ఎస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విందు భోజనం’ చిత్రం ఆహా వేదికగా జూన్‌ 28 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్‌  టాక్‌ తెచ్చుకుంది. ఇన్నాళ్లకు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆదిత్య (అఖిల్ రాజ్‌) ఓ చెఫ్‌. తండ్రి క‌ట్టించి ఇచ్చిన హోట‌ల్‌లోనే చెఫ్‌గా ప‌నిచేస్తుంటాడు. ఆ హోట‌ల్‌ను అత‌డి సోద‌రుడు వివేక్ అమ్మాల‌ని చూస్తాడు. ఆదిత్య మాత్రం అందుకు ఒప్పుకోడు. తండ్రికి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి హోట‌ల్‌ను తానే న‌డిపించాల‌ని అనుకుంటాడు. అన్న‌ద‌మ్ముల పోరాటంలో గెలుపు ఎవ‌ర‌ది? ఆదిత్య ప్రేమించిన సింగ‌ర్ (ఐశ్వ‌ర్య) ఎవ‌రు? తొలుత ఆదిత్య ప్రేమ‌ను ఆ సింగ‌ర్ ఎందుకు తిర‌స్క‌రించింది?’ అన్నది స్టోరీ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version