Weekend OTT Suggestions: ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ కావాలంటే ఈ చిత్రాలు చూసేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestions: ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ కావాలంటే ఈ చిత్రాలు చూసేయండి!

    Weekend OTT Suggestions: ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ కావాలంటే ఈ చిత్రాలు చూసేయండి!

    May 30, 2024

    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల చిత్రాలు లేక సినీ అభిమానులు బోర్‌గా ఫీలవుతున్నారు. అటు ఓటీటీలోనూ చెప్పుకోతగ్గ సూపర్ హిట్‌ చిత్రాలు రావడం లేదు. అయితే ఈ ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఇబ్బడి ముబ్బడిగా ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే రాగా.. మరికొన్ని ఈ వారాంతంలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు, సిరీస్‌లను వీకెండ్‌ సజీషన్స్‌ రూపంలో YouSay మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ వారం అస్సలు మిస్‌ కాకుండా చూడాల్సిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    శ్రీరంగ నీతులు

    సుహాస్‌, కార్తిక్‌ రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘శ్రీరంగ నీతులు‘. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. కాగా, మే 29 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మూడు కథల సమాహారమే ఈ చిత్రం. ప్లాట్‌ ఏంటంటే.. బస్తీకి చెందిన శివ (సుహాస్‌) ఓ టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. స్కూల్ గ్రౌండ్‌లో తన ఫోటోతో పెట్టిన పెద్ద ఫ్లెక్సీని ఎవరో తీసేయడంతో మళ్లీ కొత్తది పెట్టాలని పట్టుదలతో ఉంటాడు. అటు వరుణ్‌, ఐశ్వర్య ప్రేమించుకుంటారు. వీళ్లు కలిశారా? లేదా? అనేది రెండో కథ. ఉన్నత చదువులు చదివిన కార్తిక్‌ డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా మారతాడు. అతడ్ని మార్చడానికి తండ్రి ఏం చేశాడు? అనేది మూడో కథ.

    ది ఫస్ట్‌ ఒమన్‌ 

    హార్రర్‌ చిత్రాలను ఇష్టపడే వారికోసం ఓ స్పెషల్‌ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ది ఫస్ట్ ఒమన్‌ చిత్రం.. హాట్‌స్టార్‌ వేదికగా మే 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పక నచ్చుతుంది. కాబట్టి అసలు మిస్‌ కావొద్దు. రెంటల్‌ విధానంలో ఇంగ్లీష్‌ భాషలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ప్లాట్‌ ఏంటంటే.. ఒక అమెరికన్‌ యువతి సేవ చేసే ఉద్దేశంతో రోమ్‌లోని ఓ చర్చ్‌కి పంపబడుతుంది. అక్కడ ఆమెకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. దుష్టశక్తి ఆమెకు సవాళ్లు ఎదురవుతాయి. దానిని ఆ యువతి ఎలా ఎదుర్కొంది? అన్నది కథ.

    స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌

    దేశ భక్తిని రగలించే ఈ చిత్రాన్ని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు చూడవచ్చు. స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్‌ దామోదర్ జీవత కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ మే 28 నుంచి జీ 5 వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హూడా లీడ్‌ రోల్‌లో నటించారు.

    ధూమమ్

    పుష్ప ఫేమ్‌ ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) చేసిన ధూమమ్‌ అనే తమిళ చిత్రం.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓటీటీలో కాకుండా యూట్యూబ్‌లో ఈ సినిమా రిలజవుతుండటం విశేషం. మే 31 నుంచి తెలుగులో ఈ చిత్రాన్ని చూడవచ్చు. అవినాష్‌ సిగరేట్‌ తయారీ కంపెనీలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల తన ఉద్యోగాన్ని వదిలేయాలని భావిస్తాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.

    కీచురాళ్లు 

    కేరళ బ్యూటీ రజిషా విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ చిత్రం ‘కీడం’. రెండేళ్ల తర్వాత ఈ సినిమాను కీచురాళ్లు పేరుతో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. మే 30 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే.. రాధికా బాలన్‌ ఓ సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ను ప్రారంభించి కేసుల దర్యాప్తులో పోలీసులకు సాయపడుతుంటుంది. అనుకోకుండా ఓ రోజు ఆమె సైబర్‌ క్రైమ్‌ బాధితురాలిగా మారిపోతుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతకీ అతడు ఎవరు? ఆమెను ఎందుకు బెదిరించాడు? రాజీషా తన తెలివితో అతడ్ని ఎలా పట్టుకుంది? అన్నది ప్లాట్.

    రామన్న యూత్‌

    తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన రామన్న యూత్‌ చిత్రం గతేడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. కాన్సెప్ట్‌ బాగున్నా సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. కాగా, ఈ సినిమా మే 30 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. కథ ఏంటంటే.. స్థానిక ఎమ్మెల్యే రామన్నకు రాజు వీరాభిమాని. రాజకీయనాయకుడు కావాలన్న ఉద్దేశంతో తన ముగ్గురు స్నేహితులతో లిసి రామన్న యూత్‌ పేరుతో అసోసియేషన్‌ పెడతాడు. ఓ బ్యానర్‌ విషయంలో వివాదం తలెత్తడంతో ఒక్కరోజులో ఎమ్మెల్యేను కలుస్తానని ఫ్రెండ్స్‌తో బెట్‌ వెస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఎమ్మెల్యేను కలిశాడా? రాజు పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టాడా? లేడా? అన్నది కథ.

    ప్రసన్నవదనం (Prasanna Vadanam)

    గతం వారమే ఓటీటీలోకి వచ్చిన కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకెళ్తున్నాయి. వాటిలో సుహాస్‌, నందు, పాయల్‌ రాధాకృష్ణ, రాశిసింగ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ‘ప్రసన్న వదనం’ చిత్రం ఒకటి. ఈ సినిమా మే 24 నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ చూడకపోయి ఉంటే ఈ వారం తప్పక చూడండి. ప్లాట్ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.

    రత్నం (Rathnam)

    విశాల్‌ హీరోగా డైరెక్టర్‌ హరి (Weekend OTT Suggestions) కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. మే 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. ప్లాట్‌ ఏంటంటే.. రత్నం (విశాల్‌).. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జీవిస్తుంటాడు. జననీని (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అన్నది కథ.

    ఆరంభం (Aarambam)

    మోహన్‌ భగత్‌, సుప్రీత, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. మే 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మే 23 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాను చూడాలనుకునేవారు వీకెండ్‌లో ఈ చిత్రాన్ని ఎంచక్కా చూసేయండి. ప్లాట్ ఏంటంటే.. మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version