WTC FINAL SQUAD: అజింక్యా రహానే ఇన్‌..సూర్య కుమార్ యాదవ్ ఔట్‌..… హైదరాబాదీ ఆటగాడికి నిరాశ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC FINAL SQUAD: అజింక్యా రహానే ఇన్‌..సూర్య కుమార్ యాదవ్ ఔట్‌..… హైదరాబాదీ ఆటగాడికి నిరాశ!

    WTC FINAL SQUAD: అజింక్యా రహానే ఇన్‌..సూర్య కుమార్ యాదవ్ ఔట్‌..… హైదరాబాదీ ఆటగాడికి నిరాశ!

    April 25, 2023

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. దాదాపు 13 నెలల తర్వాత టెస్ట్‌ స్క్వాడ్‌లో అజింక్యా రహానేకి చోటు దక్కింది. రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఆటతీరు కనబర్చడమే కాదు.. అస్సలు ఎవరూ ఊహించని విధంగా ఐపీఎల్‌లో ఇరగదీస్తుండటంతో అతడికి ఛాన్స్ వచ్చింది. శ్రీకర్‌ భరత్‌, కేఎల్ రాహుల్‌కి మరో అవకాశం కల్పించారు. ఇక మిస్టర్‌ 360 సూర్య కుమార్ యాదవ్‌కు నిరేశే ఎదురయ్యింది. జయదేవ్ ఉనద్కత్‌కి చోటు దక్కింది.

    జట్టు: రోహిత్ శర్మ©, శుభమన్‌ గిల్‌, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ ( WK ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, షార్దుల్ థాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, జయదేవ్ ఉనాద్కత్‌

    అజింక్యా అదరహో

    ఒకప్పుడు టెస్ట్‌ జట్టులో రహానే పేరు కచ్చితంగా ఉండేది. కానీ, సంవత్సరం క్రితం నుంచి అతడిని తీసుకోవట్లేదు. ఫామ్‌ లేకపోవటంతో పాటు గాయాలు వేధించడం కారణంగా స్థానం కోల్పోయాడు. మళ్లీ కెరీర్‌ను జీరో నుంచి స్టార్ట్‌ చేశాడు రహానే. రంజీ ట్రోఫీల్లో ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 7 మ్యాచుల్లో 634 రన్స్‌ చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీతో పాటు 191 పరుగులు కూడా ఉన్నాయి. 

    స్టైల్‌ మారింది

    అజింక్యా బ్యాటింగ్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడుతున్న రహానే బ్యాటింగ్‌ చూస్తే ఇది అర్థమవుతుంది. కేకేఆర్‌తో మ్యాచుల్లో కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. అంతకముందు జరిగిన మ్యాచుల్లోనే బౌండరీలు బాది అదరగొట్టాడు రహానే. వన్డేల్లో బాల్‌కి ఒక్క పరుగు, టెస్టుల్లో నిలకడగా ఆడే అతడు.. టీ 20ల్లో ఈ స్థాయి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవటం విశేషమే. 

    డక్‌ ఔట్‌

    నిన్నమెున్నటివరకు సూర్య కుమార్ యాదవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతున్నాడని కొనియాడారు. కానీ, BGT టెస్ట్‌ మ్యాచుల్లో వరుసగా మూడుసార్లు డకౌట్‌ అయ్యాడు సూర్య. దీంతో WTC ఫైనల్‌కు అతడిని పక్కన బెట్టారు. స్కైకి అవకాశం దక్కకపోవటంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సూర్య రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో సరిగా ఆడలేడనే వాదన వినిపిస్తోంది.

    ఇంకో ఛాన్స్‌

    ఫైనల్‌ జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌ కేఎస్‌ భరత్‌కు మరో అవకాశం దక్కింది. అతడికి జట్టులో దాదాపు స్థానం ఖాయం అయినట్లే. ఎందుకంటే స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్ ఉన్నా.. భరత్‌నే వికెట్‌ కీపర్‌గా బీసీసీఐ పరిగణించింది. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటే కెరీర్‌లో తిరుగుండదు. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో విఫలమైన కేెఎల్‌ రాహుల్‌కి మరో ఛాన్స్‌ ఇచ్చారు. కేెఎల్ ఈసారి ఎలా ఆడతాడో చూడాలి.

    జయదేవ్‌

    ఈ ఏడాది రంజీల్లో అద్భుతంగా రాణించి కెప్టెన్‌గా సౌరాష్ట్రకు కప్పును తీసుకువచ్చాడు జయదేవ్. టెస్టుల్లో అవకాశాలు దక్కుతున్నప్పటికీ ఫైనల్‌ 11లో చోటు దక్కడం లేదు. ఈసారి బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఉనాద్కత్‌ WTC ఫైనల్‌కు ఎంపికయ్యాడు. కానీ, టీంలో ఉంటాడో లేదో చూడాలి.

    మర్చిపోయారా?

    జట్టును ప్రకటించిన వేళ ఓ ఆటగాడి గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. అతడే హైదరాబాదీ ఆటగాడు హనుమ విహారి. టెస్టుల్లో అద్భుతంగా రాణించే విహారిని తీసుకోలేదు. కొన్ని నెలల క్రితం చేయికి దెబ్బ తాకినా టీమిండియా కోసం ఒంటిచేత్తో పోరాటం చేశాడు. ఎప్పుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటాడు. అతడ్ని ఎందుకు మర్చిపోయారంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సూర్య కుమార్ కోసం తప్పించి.. ఇప్పుడు ఐపీఎల్‌లో రహానే ఆడటంతో అతడి గురించి తీసేశారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే. గాయాల నుంచి కోలుకోలేదని మరికొందరు వాదిస్తున్నారు.

    వైస్‌ కెప్టెన్‌ ఎవరు?

    రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ ఆడనున్నారు. 15 మంది సూపర్ టాలెంటెడ్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా… అసలు వైస్ కెప్టెన్‌ను ప్రకటించలేదు. అంతకముందు కేఎల్‌ రాహుల్‌ VCగా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో విఫలం కావటంతో సిరీస్ మధ్యలోనే తొలగించారు. ఈ సారి వైస్‌ కెప్టెన్‌ ఎవరో చెప్పకుండా జట్టును ప్రకటించడంతో క్రికెట్‌ ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version