• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం: కమిన్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంపై క్రికెటర్ కమిన్స్ స్పందించాడు. తాము 200 పరుగులకే పరిమితం కావడం ఇబ్బంది కలిగించిందని, మరో 50 పరుగులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్‌ను మిస్ కావడం గురించి అప్పుడే మర్చిపోయానని, ఇలాంటివి క్రికెట్‌లో సర్వసాధారణం అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ లైఫ్ తర్వాత కోహ్లీ మెరుగ్గా ఆడి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. https://www.instagram.com/reel/CyI_IFJPRJY/?utm_source=ig_embed&ig_rid=abd1fd86-cc97-4dd2-9e17-74ce4bd3db35

    నేడు తలపడనున్న టీమ్స్ ఇవే

    క్రికెట్ ప్రపంచ కప్‌- 2023లో భాగంగా నేడు ఉదయం 10:30 గంటలకు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడనున్నాయి. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనుండగా, సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది.

    అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్

    రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించడమే తమ లక్ష్యమని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడం, సెలక్షన్‌పై విమర్శలు రావడంతో ద్రవిడ్ ఇలా స్పందించాడు. ‘రోహిత్, కోహ్లీలకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆసియా కప్, వరల్డ్ కప్‌ ముందు ఇదే మాకు చివరి అవకాశం. అందుకే సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తాం. ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి ఆటనే మేం ఆశిస్తున్నాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు. Head Coach Rahul Dravid explains #TeamIndia's … Read more

    చర్చనీయాంశం అవుతున్న రనౌట్

    యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. స్మిత్ కూడా మైదాన్ని వీడటం ప్రారంభించాడు. అయితే, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఈ రనౌట్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు. క్రీజు ఆవల ఉన్న సమయంలో బంతి వికెట్లను తాకినప్పటికీ బుయిల్స్ విడిపోలేదన్న కారణంతో ఔట్ ఇవ్వలేదు. అయితే, మరో యాంగిల్‌లో బెయిల్స్ ఎగురుతున్నట్లు స్పస్టంగా కనిపిస్తోంది. Johnny Bairstow is … Read more

    భారత్ విజృంభణ.. 114కే విండీస్ ఆలౌట్

    వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. కరేబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ని పేకమేడల్లా కూల్చేశారు. బౌలింగ్‌కు తోడు అద్భుత ఫీల్డింగ్ వెస్టిండీస్ బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్ షై హోప్(43) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ నడ్డి విరిచారు. ముకేశ్ కుమార్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. What a … Read more

    హార్దిక్‌ని గేలి చేసిన విరాట్

    నేడు వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. నెట్స్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ని విరాట్ గేలి చేశాడు. హార్దిక్ వేసిన బంతిని కవర్స్ దిశగా బాది ఫోర్ వెళ్తుందన్నట్లుగా సిగ్నల్ ఇస్తూ ఎద్దేవా చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బార్బడోస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) … Read more

    హెన్రిచ్ క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్

    సన్‌రైజర్స్ తరఫున వీరోచిత పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసెన్ మరోసారి అదరగొట్టాడు. మేజర్ లీగ్‌ క్రికెట్‌లో 44 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో పట్టపగలే చుక్కలు చూపించాడు. రషీద్ ఖాన్‌ని సైతం వదలకుండా ఒకే ఓవర్‌లో 26 పరుగులు బాదాడు. దీంతో సియాటెల్ ఆర్కాస్ 2 వికెట్లు మిగిలి ఉండగానే 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. Heinrich Klaasen smashed 6,6,2,4,6 against Rashid … Read more

    ఏకిపారేసిన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంపైర్లను, బంగ్లా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ని ఏకిపారిసేంది. ‘సిరీస్‌లో ఎంతో నేర్చుకున్నాం. అంపైరింగ్ తప్పిదాలు విచారకరం. నాటౌట్‌లను ఔట్‌గా ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది. ఇక ఈ తరహా అంపైరింగ్‌కి అలవాటు పడటానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. భారత హైకమిషన్‌ని కూడా ప్రజెంటేషన్ సెర్మనీకి ఆహ్వానిస్తారని ఊహించా. అదీ జరగలేదు’ అంటూ చీవాట్లు పెట్టింది. హర్మన్ ఔటైన తీరు కూడా చర్చనీయాంశం అయింది. చివరి వన్డే టై కావడంతో 1-1తో 3 వన్డేల … Read more

    Most 5 Wicket Hauls: టెస్టుల్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా?  

    క్రికెట్‌లో టెస్టు ఫార్మెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. వన్డే, టీ20లతో పోలిస్తే ఒక ఆటగాడిలోని పూర్తి సామర్థ్యాన్ని టెస్టు మ్యాచ్‌లు వెలికితీస్తాయి. ఈ నేపథ్యంలోనే తమను తాము నిరూపించుకునేందుకు ఆటగాళ్లు టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బ్యాటర్లు, బౌలర్లు టెస్టుల్లో పలు రికార్డులను నమోదు చేశారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి, టెస్టుల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ముత్తయ్య మురళీధరన్‌ … Read more

    యాషెస్ సిరీస్.. కలుసుకున్న ప్రధానులు

    టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ వేరు. ఇటీవల యాషెస్‌లో జరిగిన వివాదంపై ఇరు దేశాల ప్రధానులు మాటల దాడి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న వీరిద్దరూ కలిశారు. సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సిరీస్‌లో తామే లీడ్‌లో ఉన్నట్లు(2-1)ని ఆసీస్ ప్రధాని అల్బనీస్ చూపించగా, మూడో టెస్టులో విజయానందంలో ఉన్న ప్లేయర్ల ఫొటోని రిషి సునాక్ ప్రదర్శించారు. అనంతరం, బెయిర్ స్టో స్టంపింగ్‌ని చూపించి అల్బనీస్ మరింత ఉత్సాహ పరిచారు. దీంతో రిషి బిగ్గరగా నవ్వారు. Ashes … Read more